
అత్యంత వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎస్ శాంతికుమారి. అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో వివిధ శాఖల కార్యర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్ సోమవారం సమీక్ష నిర్వహించారు. జూన్ 2న ఉదయం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పిస్తారని.. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరిస్తారని ఆమె చెప్పారు.
రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై కళారూపాల కార్నివాల్ ఉంటుందన్నారు సీఎస్ శాంతికుమారి. దాంతో పాటు శిక్షణ పొందుతున్న 5వేల మంది పోలీస్ అధికారులు బ్యాండ్‌తో ఈ ప్రదర్శనలో పాల్గొంటారన్నారు. ట్యాంక్‌బండ్‌పై హస్తకళల, చేనేత కళల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా నగరంలోని ప్రముఖ ఫుడ్ స్టాళ్లునె కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లగా వెల్లడించారు. పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
జూన్ 2న రాత్రి ట్యాంక్‌బండ్‌పై బాణాసంచా, లేజర్ షో ఉంటుందని చెప్పుకొచ్చారు సీఎస్ శాంతికుమారి. ట్యాంక్ బండ్‌పై పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. . రాష్ట్ర అవతరణ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని అధికారులకు ఆమె సూచించారు.