రాష్ట్ర అవతరణ వేడుకలపై సీఎస్ సమీక్ష

రాష్ట్ర అవతరణ వేడుకలపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్:  రాష్ట్ర అవతరణ వేడుకల  ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి తోపాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలిన అధికారులను ఆదేశించారు. అనంతరం సీ.ఎస్. సోమెష్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న సీఎం కేసీఆర్ ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకుంటారని, అక్కడ తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తారని తెలిపారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని పేర్కొన్నారు. పోలీసు దళాల గౌరవ  అందనాన్ని స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని తెలిపారు. అదేరోజు సాయంత్రం 30 రవీంద్ర భారతిలో నిర్వహించే కవి సమ్మేళనానికి సీఎం హాజరవుతారని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం...

దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం

చెరువు మట్టిని పొలాలకు తీసుకెళ్లనీయడం లేదు