హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు: డిప్లొమా, డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ విడుదల!

హైదరాబాద్ NGRIలో  ఉద్యోగాలు:  డిప్లొమా, డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ విడుదల!

సీఎస్ఐఆర్– నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్  ఇన్ స్టిట్యూట్ (ఎన్​జీఆర్ఐ) ప్రాజెక్ట్ పర్సనల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: ప్రాజెక్ట్ పర్సనల్.

మొత్తం ఖాళీలు: 19. 

విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్–II  2, ప్రాజెక్ట్ అసోసియేట్–I 15, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ సైంటిస్ట్–III 1.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఈఈఈ/ ఈసీఈ/ ఈఐఈలో డిప్లొమా, ఫిజిక్స్/ జియాలజీ/ కెమిస్ట్రీ/ కంప్యూటర్స్​లో బీఎస్సీ, జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్/ జియోసైన్స్/ఎర్త్ సైన్సెస్​లో ఎంఎస్సీ/ ఎం.టెక్,  జియాలజీ/ అప్లై జియాలజీ/ ఎర్త్ సైన్సెస్​లో పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 45 ఏళ్లు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 5, 7, 11.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.ngri.res.inను సందర్శించండి.