CSK, SRH Trade: ఐపీఎల్ 2027 (IPL 2027) వేలానికి ముందే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే భారీ ప్లేయర్ ట్రేడింగ్ ఒప్పందం పూర్తయింది. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య ఏకంగా నలుగురు స్టార్ ఆటగాళ్లకు సంబంధించిన ట్రేడ్‌ను బీసీసీఐ (BCCI) అధికారికంగా ధృవీకరించింది. ఈ ట్రేడింగ్ డీల్‌లో ఇంగ్లాండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్స్టన్, జాక్ ఎడ్వర్డ్స్ సీఎస్కే జెర్సీ ధరించనుండగా.. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లు ఎస్ఆర్హెచ్ జట్టులోకి వెళ్లారు.
CSK లోకి కొత్తగా చేరిన ప్లేయర్లు (CSK Acquisitions):
* లియామ్ లివింగ్స్టన్ (Liam Livingstone): ఇంగ్లాండ్ బిగ్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టన్‌ను ఎస్ఆర్హెచ్ గతంలో రూ. 13 కోట్లకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం రూ. 6 కోట్లకు తగ్గించిన ధరతో (Reduced Fee) చెన్నై సూపర్ కింగ్స్ అతడ్ని దక్కించుకుంది.
* జాక్ ఎడ్వర్డ్స్ (Jack Edwards): ఆస్ట్రేలియన్ సీమ్-బౌలింగ్ ఆల్‌రౌండర్ ఎడ్వర్డ్స్ ని రూ. 3 కోట్లకు సీఎస్కే తీసుకుంది. కాలి గాయం (Foot Injury) కారణంగా ఇతడు ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమయ్యాడు.
SRH లోకి తిరిగొచ్చిన స్టార్ బౌలర్లు (SRH Strategic Additions):
* ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed): ఎడమచేతి వాటం భారత పేసర్ ఖలీల్ అహ్మద్ తన పాత ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. రూ. 4.8 కోట్లకు ఎస్ఆర్హెచ్ ఇతడిని ట్రేడ్ చేసుకుంది. 2018–21 వరకు ఎస్ఆర్హెచ్కు ఆడిన ఖలీల్, 2025లో సీఎస్కే తరఫున 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. (2026లో తొడ కండరాల గాయం కారణంగా కేవలం 5 మ్యాచ్‌లే ఆడాడు).
* నాథన్ ఎల్లిస్ (Nathan Ellis): ఆస్ట్రేలియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ రూ. 2 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్యాకేజీలోకి చేరాడు, ఎస్ఆర్హెచ్ పేస్ బౌలింగ్‌ను మరింత బలోపేతం చేయనున్నాడు.
OFFICIAL ANNOUNCEMENT CSK trades Khaleel Ahmed and Nathan Ellis to SRH for Liam Livingstone and Jack Edwards. READ MORE : https://t.co/T2Dlr46dwR #WhistlePodu https://t.co/TtPR1nzLs2
— Chennai Super Kings (@ChennaiIPL) November 5, 2026
