తాజాగా విమెన్స్ డబ్ల్యూఐపీఎల్ కోసం (ఇండియన్ ప్రీమియర్ లీగ్) బీసీసీఐ బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్ లో పటిష్టమైన జట్టు సీఎస్ కే (చెన్నై సూపర్ కింగ్స్).. తమ ఫ్రాంచెజీ తరుపున విమెన్ ఐపీఎల్ లో కూడా సీఎస్ కే టీం ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి సీఎస్ కే సీఈఓ ‘మేము విమెన్ ఐపీఎల్ లో జట్టును కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాం. వరల్డ్ పాపులర్ జట్టు సీఎస్ కేకి మహిళల జట్టు లేకపోతే బాగుండదు. మా ఫ్రాంచేజీ తరుపున మహిళా క్రికెట్ ను ప్రోత్సహించాలనుకుంటున్నాం’ అని కీలక వాక్యలు చేశాడు.
అయితే, విమెన్ ఐపీఎల్ బిడ్ లో పాల్గొనేవాళ్లు ఈనెల 21లోపు దరకాస్తు చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలు రూ. 5లక్షలు (నాన్ రిఫండబుల్) చెల్లించాలని బీసీసీఐ కోరింది. విమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ మార్చి4 నుంచి 26 వరకు జరిగే అవకాశం ఉంది. ఆరంభ సీజన్ లో ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి.