CTET 2024 జూలై విడుదల అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

CTET 2024 జూలై విడుదల అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ 2024(జూలై) నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 7న విడుదల చేసింది. బీఈడీ, డీఈడీ చేసిన వారు సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ లో బోధించాలంటే ఈ టెస్ట్ పక్కా పాస్ కావాలి. ప్రతి సంవత్సరం జులై, డిసెంబరు రెండుసార్లు సీబీఎస్‌ఈ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. దరఖాస్తు ప్రక్రియను కూడా మార్చి 7న ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ లో అపై చేసుకోవచ్చు. 

ఎప్రిల్ 8నుంచి 12 మధ్యలో అప్లికేషనల్ లో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు. ఒకటి నుంచి 5వ తరగతికి బోధించడానికి పేవర్ 1 (ప్రైమరీ స్టేజ్),6 నుంచి 8వ క్లాస్ పిల్లలకు పాఠాలు చెప్పడానికి పేపర్- 2 (ఎలిమెంటరీ స్టేజ్) రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్ లో 150 మార్కులకు నిర్వహిస్తారు.  జనరల్  అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లకు అయితే రూ.1200 చెల్లించాలి.  ఒక్క పేపర్ అయినా, రెండూ ప్రేపర్లు అయినా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500 మాత్రమే.  జూలై 7న ఎగ్జామ్ పరీక్ష ఉంటుంది. ఆగస్ట్ చివరి వారంలో రిజల్ట్స్ విడుదల అవుతాయి.

ALSO READ :- IPL 2024: ఐపీఎల్ ఒక బంగారు బాతు.. ప్రపంచంలో రెండో సంపన్న లీగ్: అరుణ్ ధుమాల్