కరెంట్​ ఎఫైర్స్​

కరెంట్​ ఎఫైర్స్​

నీరజ్‌‌‌‌‌‌‌‌ చోప్రాకు రజతం 

భారత జావెలిన్‌‌‌‌‌‌‌‌ త్రో స్టార్‌‌‌‌‌‌‌‌ నీరజ్‌‌‌‌‌‌‌‌ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో సిల్వర్​ మెడల్​ సాధించాడు. ఫైనల్లో 88.13 మీటర్ల దూరం ఈటెను విసిరి రెండో స్థానం సాధించాడు.  డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ అండర్సన్‌‌‌‌‌‌‌‌ పీటర్స్‌‌‌‌‌‌‌‌ (గ్రెనెడా) పతక పోరులో 90.54 మీ. దూరంతో పసిడి పట్టేశాడు. 

అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌లో అమెరికా అగ్రస్థానం

ప్రపంచ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో అమెరికా 13 స్వర్ణాలు, 9 సిల్వర్​, 11 కాంస్యాలతో సహా 33 పతకాలతో టాప్​లో నిలిచింది. ఇథియోపియా ,  జమైకా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. 

15వ రాష్ట్రపతిగా ముర్ము  

గిరిజన కుటుంబంలో పుట్టిన  ద్రౌపదీ ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌.వి.రమణ పార్లమెంట్​ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ హాలులో ప్రమాణం చేయించారు. అతిపిన్న వయసులో రాష్ట్రపతి పీఠాన్ని దక్కించుకున్న వ్యక్తిగా ద్రౌపది (64) ఘనత సాధించారు. గతంలో ద్రౌపది ముర్ము జార్ఖండ్​ గవర్నర్​గా పనిచేశారు.

కుబేరుల జాబితాలో అదానీకి నాలుగో స్థానం

అదానీ గ్రూపు సంస్థల చైర్మన్‌‌‌‌‌‌‌‌ గౌతమ్‌‌‌‌‌‌‌‌ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానాన్ని అధిరోహించారు. ఫోర్బ్స్‌‌‌‌‌‌‌‌ రియల్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ కుబేరుల జాబితా ప్రకారం.. అదానీ సంపద 116.30 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లు (సుమారు రూ.9,30,000 కోట్లు). టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌‌‌‌‌‌‌‌ మస్క్‌‌‌‌‌‌‌‌ అగ్రస్థానంలో ఉండగా, ముకేశ్‌‌‌‌‌‌‌‌ అంబానీ 10వ స్థానం పొందారు.

అప్పుల్లో తమిళనాడు టాప్

రిజర్వ్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ నివేదిక ప్రకారం 2020 మార్చి నుంచి 2022 మార్చి వరకు తమిళనాడు రూ.6,59,868  కోట్ల అప్పుతో దేశంలో మొదటిస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు కాగా, ఏపీ అప్పు రూ.3,98,903 కోట్లుగా ఉంది.  

అమ్మంగి వేణు గోపాల్‌‌‌‌‌‌‌‌

తెలంగాణ సారస్వత పరిషత్​ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి 91వ జయంతి  నిర్వహించారు. ఈ ఏడాది ప్రముఖ కవి, విమర్శకుడు డా.అమ్మంగి వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌కు డా.సి.నారాయణరెడ్డి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. రూ.25 వేల నగదు, శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.

కౌశిక్‌‌‌‌‌‌‌‌ రాజశేఖర

అమెరికాలోని హ్యూస్టన్‌‌‌‌‌‌‌‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన కౌశిక్‌‌‌‌‌‌‌‌ రాజశేఖర ప్రతిష్టాత్మక గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ ప్రైజ్‌‌‌‌‌‌‌‌కు ఎంపికయ్యారు. విద్యుత్​ ఉత్పాదక ఉద్గారాలను తగ్గించేటపుడు విద్యుత్​ రవాణా, శక్తిసామర్థ్య సాంకేతికతల రంగంలో అందించిన సేవలకు అవార్డు దక్కింది.  

సయ్యద్‌‌‌‌‌‌‌‌ హఫీజ్‌‌‌‌‌‌‌‌

ప్రముఖ బిజినెస్‌‌‌‌‌‌‌‌ పత్రిక ఫోర్బ్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా ప్రకటించిన ‘టాప్‌‌‌‌‌‌‌‌ 100 డిజిటల్‌‌‌‌‌‌‌‌ స్టార్స్‌‌‌‌‌‌‌‌’లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సయ్యద్‌‌‌‌‌‌‌‌ హఫీజ్‌‌‌‌‌‌‌‌ 32వ స్థానంలో నిలిచారు. ఆయన యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తున్న ‘తెలుగు టెక్‌‌‌‌‌‌‌‌టట్స్‌‌‌‌‌‌‌‌’కు ఈ గుర్తింపు లభించింది. 

వీవీఎస్‌‌‌‌‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ 

ఐసీసీ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ను ఎన్నుకునే ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ఎన్నికలు నవంబర్​లో జరుగుతాయి. కొత్త చైర్మన్‌‌‌‌‌‌‌‌ డిసెంబరు 1 నుంచి రెండేళ్లు పదవిలో ఉంటాడు. వీవీఎస్‌‌‌‌‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కు ఐసీసీ పురుషుల క్రికెట్‌‌‌‌‌‌‌‌ కమిటీలో చోటు దక్కింది. ఆటగాళ్ల ప్రతినిధిగా కమిటీలో ఉంటాడు. 

ఇందర్మిత్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌

ప్రపంచ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ తన ముఖ్య ఆర్థికవేత్త, సీనియర్‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఇందర్మిత్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ను నియమించింది. కౌశిక్‌‌‌‌‌‌‌‌ బసు తర్వాత ప్రపంచ బ్యాంకులో ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులైన రెండో భారత జాతీయుడు ఈయనే. 2022 సెప్టెంబరు 1 నుంచి గిల్‌‌‌‌‌‌‌‌ నియామకం అమల్లోకి వస్తుంది. 

68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

68వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో  ‘సూరరై పోట్రు’ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ నటులుగా  సూర్య, అజయ్​ దేవగణ్, అపర్ణ ఎంపికయ్యారు. ‘కలర్‌‌‌‌‌‌‌‌ ఫొటో’ తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. 

రాష్ట్రంలో కొత్త మండలాలు

తొమ్మిది జిల్లాల్లో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 594 మండలాలుండగా, కొత్త వాటితో కలిపి మొత్తం సంఖ్య 607కి చేరనుంది. 

రైల్వేస్టేషన్లో ‘ఆజాదీకీ రైల్‌‌‌‌‌‌‌‌ గాడీ’ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌‌‌‌‌‌‌‌ మహోత్సవం’లో భాగంగా ‘ఆజాదీకీ రైల్‌‌‌‌‌‌‌‌ గాడీ, ఔర్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌’ కార్యక్రమం ఏర్పాటు చేసింది. 

ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు రష్యా సెలవు 

ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ యుద్ధంతో పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా 2024 తర్వాత ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించింది. భూకక్ష్యలో సొంతంగా ఇలాంటి కేంద్రం నిర్మించడంపై దృష్టి పెట్టనున్నట్లు  రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌‌‌‌‌‌‌‌ కాస్మోస్‌‌‌‌‌‌‌‌ అధిపతి యూరి బోరిసోవ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

చైనా రోబో ట్యాక్సీ

చైనా దిగ్గజ టెక్నాలజీ సంస్థ బైడూ ‘అపోలో ఆర్‌‌‌‌‌‌‌‌టీ6’ పేరుతో సెల్ఫ్‌‌‌‌‌‌‌‌–డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్సీని  ఆవిష్కరించింది. ఇది ‘అపోలో గో’ యాప్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా పనిచేస్తుందని చెబుతోంది. తనంతట తానే నడుపుకొనే ఈ ట్యాక్సీలో 38 రకాల సెన్సర్లు ఉంటాయి. 

శ్రీలంక ప్రధానిగా దినేశ్‌‌‌‌‌‌‌‌ గుణవర్దెన

రాజపక్స కుటుంబానికి సన్నిహితుడైన మహాజన ఏక్‌‌‌‌‌‌‌‌సాథ్‌‌‌‌‌‌‌‌ పెరమున (ఎంఈపీ) పార్టీ నేత దినేశ్‌‌‌‌‌‌‌‌ గుణవర్దెన శ్రీలంక కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. అధ్యక్షుడు రణిల్‌‌‌‌‌‌‌‌ విక్రమసింఘె మొత్తం 18 మంది కేబినెట్‌‌‌‌‌‌‌‌ సహచరులతో ప్రమాణస్వీకారం చేయించారు.

ఇటలీ ప్రధాని రాజీనామా 

ఇటలీలో సంకీర్ణ సర్కారులోని కీలక మిత్రపక్షాల మద్దతు కోల్పోవడంతో ప్రధాని మారియో ద్రాగీ తన పదవికి రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు సెర్జియో మాటరెలాను కలిసి రాజీనామా సమర్పించారు. ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై రష్యా యుద్ధం తదితర పరిణామాలతో ఇటలీ తీవ్రంగా ఇబ్బందులకు గురవుతోంది.