దీపం పట్టాడు.. పెయింటింగ్స్ వేశాడు

దీపం పట్టాడు..  పెయింటింగ్స్ వేశాడు

పెయింటింగ్ వేయాలంటే.. బ్రష్, కలర్స్ కావాలి. కానీ ఒడిశాలోని కటక్కు  చెందిన దీపక్ బిస్వాల్కు దీపం ఉంటే చాలు.  ఔను.. దీపం నుంచి వచ్చే పొగ మసితో చూడచక్కటి పెయింటింగ్స్ను ఆయన అవలీలగా వేస్తారు. గతంలో ఎంతోమంది దేశ ప్రముఖులు, కళా ఖండాలు, చారిత్రక కట్టడాల ఫొటోలను పొగ మసితో వేసి భళా అనిపించారు.

జులై 1 నుంచి పూరీ జగన్నాథ రథోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో  పొగ మసితో పూరీ జగన్నాథుడు, బలభద్ర, సుభద్రల రథాలను  దీపక్  చక్కగా చిత్రించారు.  ఈ పెయింటింగ్ వేయడానికి దాదాపు 7 గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు. తొలుత దీపం పొగ మసిని క్యాన్వాస్ పైకి తీసుకొని.. దానిపై అత్యంత సున్నితంగా, సృజనాత్మకంగా బ్రష్ ను కదుపుతూ చిత్రాన్ని గీయడాన్నే స్మోక్ పెయింటింగ్ అంటారు.