నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న టీచర్ పర్వీన్ కు ఈ నెల 22న స్నేహితుల ఫోన్ నుంచి అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. వెంటనే ఆమె ఆన్లైన్ లో రూ.40 వేలు పంపించింది.
కొద్ది సేపటి తరువాత మరో రూ.20 వేలు కావాలని మెసేజ్ రాగా, అనుమానంతో స్నేహితురాలికి ఫోన్ చేయగా ఫోన్ హ్యాక్ అయిందని చెప్పడంతో షాక్కు గురైంది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించి వెంటనే డయల్ 1098 ద్వారా ఫిర్యాదు చేసింది. సోమవారం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు కంప్లైంట్చేయగా, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
