
హైదరాబాద్ గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రమాద ఘటనపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. “ఈ ఫ్లైఓవర్ పై 40 స్పీడ్ దాటకుడదు.. కానీ నిత్య నీలన్ అనే వ్యక్తి వోక్స్ వ్యాగన్ కార్లో 90 నుండి 100 స్పీడ్ లో వచ్చాడు..ఫ్లైఓవర్ పై ఉన్న కార్నర్ లో స్పీడ్ కంట్రోల్ అవకపోవడంతో ఈ ఘటన జరిగింది. సత్యవేణి అనే మహిళ స్పాట్ లో చనిపోయింది. ఇంకో ముగ్గురికి గాయాలయ్యాయి. డ్రైవర్ తో పాటు గాయాలైన మరో ముగ్గురిని కేర్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నాం. ఈ ఫ్లైఓవర్ ని ఇంజినీర్ల తో మరోసారి పరిశీలించాలని సూచిస్తున్నాం.” అని సీపీ తెలిపారు.
బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుంచి ఆ కారు (TS09 EW 5659) ఒక్కసారిగా ఫ్లై ఓవర్ కింద నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళపై పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఫ్లై ఓవర్ పై నుంచి పల్టీలు కొడుతూ కింద ఆటో కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపై పడడంతో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.
Related news: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి పల్టీకొట్టిన కారు