ల‌క్కీ డ్రా పేరుతో ల‌క్ష‌ల మోసం

ల‌క్కీ డ్రా పేరుతో ల‌క్ష‌ల మోసం
  • ల‌క్కీ డ్రా పేరుతో ల‌క్ష‌లు మోసం
  • 25 లక్షలు లక్కీ డ్రాలో గెలుచుకున్నారంటూ మోసం

మెదక్ : ల‌క్కీ డ్రా పేరుతో 6 ల‌క్ష‌లు మోసం చేశారు కేటుగాళ్లు.  మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన మరుగంటి వేణు రూ. 25 లక్షలు లక్కీ డ్రాలో గెలుచుకున్నట్లు అతని ఫోన్‌కు సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపారు. రూ.25 లక్షలు పంపాలంటే ముందుగా నగదు డిపాజిట్ చేయాలంటూ విడతల వారీగా రూ.6.20 లక్షలు కాజేశారు. ఆ త‌ర్వాత కాల్ చేస్తే మ‌రో నాలుగు ల‌క్ష‌లు డిపాజిట్ చేయాలంటూ మాయ‌మాట‌లు చెప్పారు. దీంతో మోస‌పోయామ‌ని తెలుసుకున్న వేణు..  పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మోసాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌ని సూచించిన‌ పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌న్నారు.