మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. సికింద్రాబాద్ మీదుగా వెళ్లే 133 రైళ్లు రద్దు..

మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. సికింద్రాబాద్ మీదుగా వెళ్లే 133 రైళ్లు రద్దు..

మొంథా తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా కొన్నిప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రవాణా మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు రూట్లలో రైల్వే ట్రాకులు దెబ్బతినటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.  తుఫాను ప్రభావంతో సికింద్రాబాద్ మీదుగా వెళ్లే 133 రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే బుధవారం (అక్టోబర్ 29) ప్రకటించింది. 

మొంధా తుఫాన్ కారణంగా రెండో రోజు సైతం రైళ్ళ రద్దు కొనసాగుతోంది. సికింద్రాబాద్ మీదుగా వివిధ రూట్లలో వెళ్లే 133 రైళ్ళు రద్దు చేసిన దక్షణమధ్య రైల్వే శాఖ.. 28 రైళ్ళను దారి మళ్ళించింది. డోర్నకల్ రైల్వే స్టేషన్ లో ట్రాక్ పై   భారీగా వదర నీరు చేరటంతో ఆ రూట్లో రైళ్లు వెళ్లటం కష్టంగా మారింది. 

అదే విధంగా సికింద్రాబాద్ - విజయవాడ మధ్యలో 10 రైలు రద్దు చేశారు. 7, ప్యాసింజర్,3 ఎక్స్ ప్రెస్ రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. ఈ మార్గం లో 20 లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ దారి మళ్లించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ట్రాక్ ఎక్కడా డ్యామేజ్ కాలేదని తెలిపిన రైల్వే అధికారులు.. ముందస్తు జాగ్రత్తగా రాకపోకలను నిలిపివేసినట్లు ప్రకటించారు. అటు విశాఖ పట్నం- - సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ ను వర్షాల కారణంగా డైవర్ట్ చేసినట్లు ప్రకటించారు.