సౌతాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా

సౌతాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా

 జోహన్నెస్​బర్గ్: సౌతాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా(71) రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. ఆఫ్రిక‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్(ఏఎన్సీ), ప్రతిపక్ష పార్టీలు తమ విభేదాలను పక్కనపెట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు రామఫోసాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో రామఫోసా.. ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేత జూలియస్ మలేమాపై సులభంగా గెలిచారు. రామఫోసాకు 283 ఓట్లు రాగా మలేమాకు 44 ఓట్లు మాత్రమే వచ్చాయి.  రామఫోసాకు చెందిన ఏఎన్సీ, ఇతర చిన్న పార్టీలు కూటమిగా ఏర్పడి సర్కారును ఏర్పాటు చేశాయి.