అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'. భారీ అంచాలతో ఈ మూవీ ఏప్రిల్ 10, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. ఇపుడు ఈ థ్రిల్లర్ మూవీ త్వరలోనే ఓటీటీకి ఎంట్రీ ఇవ్వనుంది. వచ్చే వీకెండ్ స్పెషల్గా శుక్రవారం మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
#Dacoit on Amazon Prime, 08th May.
— OTT Gate (@OTTGate) May 3, 2026
In Telugu, Tamil, Malayalam, Kannada. pic.twitter.com/2uRkA4UJ1Y
కథాంశం..
'డెకాయిట్' కథాంశం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. జైలు నుంచి తప్పించుకున్న ఒక హత్య నేరస్తుడు, తన మాజీ ప్రేయసిపై పగ తీర్చుకోవడమే లక్ష్యంగా ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఈ క్రమంలో జరిగే ఊహించని పరిణామాలు, మలుపులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి. ఏది తప్పు? ఏది ఒప్పు? అనే సందిగ్ధంలో సాగే ఈ ప్రయాణం క్లైమాక్స్ వరకు ఉత్కంఠను రేపుతుంది. ఈ సినిమాలో అడివి శేష్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు
సినిమాలో స్టైలిష్‌గా అడివి శేష్ కనిపిస్తూనే, భావోద్వేగ సన్నివేశాల్లోనూ రాణించారు. మృణాల్ ఠాకూర్ తన పాత్ర పరిధి మేరకు అద్భుతమైన నటనను కనబరిచారు. అడివి శేష్‌తో ఆమె కెమిస్ట్రీ స్క్రీన్ పై ఫ్రెష్‌గా ఉంది. ఒక విలక్షణమైన పోలీస్ ఆఫీసర్‌గా అనురాగ్ కశ్యప్ కొత్త లుక్‌లో కనిపించారు.
ఇక సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన అనుభవాన్ని జోడించారు. చిత్ర దర్శకుడు షానియెల్ డియోతో కలిసి శేష్ స్టోరీ, స్క్రీన్‌ప్లే రాయడం విశేషం. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.
