నడుస్తున్న రైలులో మంటలు..పరుగులు తీసిన ప్రయాణికులు

నడుస్తున్న రైలులో మంటలు..పరుగులు తీసిన ప్రయాణికులు

గుజరాత్ లోని ఓ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది.  దాహోద్ -ఆనంద్ రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. రైలు నడుస్తుండగానే మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును ఆపేశారు. ఆ వెంటనే ప్రయాణకులంతా దిగిపోయారు. 

గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా నుంచి అనంద్ వెళ్తున్న రైలు..దాహోద్ సమీపంలోకి రాగానే ఇంజన్ లో  మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే ఇంజిన్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఇతర బోగీలకు కూడా మంటలు వ్యాపించాయి. అయితే దీన్ని గమనించిన రైల్వే లోకో పైలెట్ ,ఇతర సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో చైన్ ను లాగిన ప్రయాణికులు..రైలు ఆగిన వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. 

Also Read :- పడితే పోతావ్ రా.. రైలు బోగీ వెనకలా ఇలా ప్రయాణం

 అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది..మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అందరూ క్షేమంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.