వాసాలమర్రి: రేపే మీ అకౌంట్లో రూ.10లక్షలు పడ్తయ్

వాసాలమర్రి: రేపే మీ అకౌంట్లో రూ.10లక్షలు పడ్తయ్

వాసాలమర్రిలో రేపటి నుంచే దళిత బంధు అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలున్నాయని.. వారికి రేపటి నుంచి అకౌంట్లలో రూ.10లక్షలు పడతాయన్నారు. దళిత బంధు సొమ్ము మీ భాద్యతేనన్నారు. దళితుల్లో ఐకమత్యం రావాలన్నారు. వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్. దళితులు అణిచివేతకు వివక్షకు గురయ్యారన్నారు. దళితులు ఇంకా పేదరికంలోనే ఉన్నామన్నారు. దళిత సమాజం కోసం అంబేద్కర్ ఎంతో పోరాటం చేశామన్నారు. ఆయన పోరాటం వల్లే దళితులకు రిజర్వేషన్లు వచ్చాయన్నారు. ప్రభుత్వాలు సరైన విధానాలు పాటించకే ఇప్పటికీ పేదరికంలో ఉన్నారన్నారు. వాసాలమర్రిలో కొత్త ఇళ్లు కట్టిస్తామన్నారు. వాసాలమర్రిని ఎర్రవెల్లిలా అభివృద్ధి చేస్తామన్నారు. దళిత బంధు పథకాన్ని ఈ మధ్యనే మొదలు పెట్టామని..ఈ పథకాన్ని విఫలం కానివ్వొద్దన్నారు. వాసాల మర్రిలో ఉన్న బీసీలను ఆదుకుంటామన్నారు. వాసాలమర్రిలో అన్ని వర్గాలను ఆదుకుంటామన్నారు. వాసాలమర్రిలో కబ్జాకు గురైన భూముల వివరాలను సేకరించామన్నారు. దళితులందరికీ భూములు వచ్చేలా పంచుతామన్నారు.