
దాల్మియా సిమెంట్, ప్రముఖ గేట్ వే సంస్థ పేటీఎంలు భాగస్వామ్యం అయ్యాయి. నగదు రహిత చెల్లింపుల పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాల్మియా సిమెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. తద్వారా దాల్మియా సిమెంట్ డీలర్లు , చెల్లింపు పరిష్కారాలతో పాటు సులభంగా వినియోగదారుల నుంచి చెల్లింపులను యుపీఐ, పేటీఎం వాలెట్ మరియు ఇతర నాన్ క్యాష్ పేమెంట్ విధానాలను వినియోగించవచ్చన్నారు.ఈ భాగస్వామ్యం గురించి దాల్మియా సిమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రమేష్ ఆర్య మాట్లాడుతూ రిటైలర్లు తమ రోజువారీ వ్యాపార లావాదేవీలను అత్యంత సులభంగా చేసుకునేందుకు సహాయ పడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. పేటీఎం డిజిటల్ చెల్లింపుల్లో అగ్రగామిగా నిలుస్తుందని దాల్మియా సిమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రమేష్ ఆర్య ప్రశంసల వర్షం కురిపించారు.