
ఓ వైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు దర్శకుడిగానూ బిజీ అవుతున్నాడు ధనుష్. రీసెంట్‌గా ‘రాయన్’చిత్రాన్ని డైరెక్ట్ చేసి, హీరోగానూ సక్సెస్ అందుకున్న ధనుష్.. మరో సినిమాలో కూడా లీడ్‌గా చేస్తూనే, దర్శకత్వం వహిస్తున్నట్టు ప్రకటించాడు. గురువారం ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు.
‘ఇడ్లీ కడై’ టైటిల్‌తో రూపొందించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఇడ్లీ బండి దగ్గర పిల్లలు నిల్చొని ఉండటం ఆసక్తిని పెంచుతోంది. డైరెక్టర్‌గా ధనుష్‌కి ఇది నాలుగో మూవీ కాగా, హీరోగా 52వ సినిమా. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ మొదటి ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.