సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడిగా దరువు ఎల్లన్న

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడిగా దరువు ఎల్లన్న

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (హైదరాబాద్ రీజియన్) సభ్యుడిగా ప్రముఖ గాయకుడు, బీజేపీ నేత దరువు ఎల్లన్నను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో దరువు ఎల్లన్న రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. 

విద్యార్థి నేత దరువు ఎల్లన్న స్వస్థలం మెదక్ జిల్లా. ఇంటర్, డిగ్రీ సిద్ధిపేటలో చదివిన ఎల్లన్న.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్, పీహెచ్ డీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే ఆయన విద్యార్థుల సమస్యలపై పోరాడారు. కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన ఎల్లన్న... తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను ఉత్తేజితుల్ని చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభంలో దరువు ఎల్లన్న కాంగ్రెస్ లో చేరారు. ఇటీవలే ఆయన బీజేపీలో చేరారు. ఎల్లన్న సేవలను గుర్తించిన పార్టీ... సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా అవకాశం కల్పించింది.