సింగరేణిలో దసరా సెలవు రోజును మార్చండి..టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి

సింగరేణిలో దసరా సెలవు రోజును మార్చండి..టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి

గోదావరిఖని, వెలుగు: గాంధీ జయంతి రోజున దసరా పండుగ రావడంతో బొగ్గు గని కార్మికులు నిర్వహించుకోవడం  సాధ్యం కానందున సెలవు రోజును మార్చాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. 

గాంధీ జయంతి రోజు జీవహింస చేయడం చట్ట విరుద్ధమని, గని కార్మికులకు ఆ రోజు సెలవు ఇవ్వడం ద్వారా మద్యం, మాంసం తింటే చట్టరీత్యా కేసులు నమోదు చేసే చాన్స్ ఉందని పేర్కొన్నారు. కార్మిక కుటుంబాలకు నష్టం కలిగించే విధంగా ఉండడంతో సెలవును అక్టోబర్​1 లేదా 3వ తేదీకి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి మేనేజ్​మెంట్​సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.