ఖర్జూరతో కస్టర్డ్ ఎలా చేయాలో తెలుసా..? చాలా సింపుల్ రెసిపీ..హెల్త్ బెనిఫిట్స్ బోలెడు..

ఖర్జూరతో కస్టర్డ్ ఎలా చేయాలో తెలుసా..? చాలా సింపుల్ రెసిపీ..హెల్త్ బెనిఫిట్స్ బోలెడు..

ఖర్జూరలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, 'న్యూట్రియెంట్స్ ఎక్కువ ఉంటాయి. దీన్ని రెగ్యులర్ డైట్ గా  తీసుకుంటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

కావాల్సినవి:

  • ఖర్జూర - ఐదు
  • కస్టర్డ్ పౌడర్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
  • చక్కెర - రుచికి సరిపడా 
  • పాలు - ఒక గ్లాస్
  • జీడిపప్పు పలుకులు - గార్నిష్ కోసం

తయారీ : ఖర్జూర గింజలు తీసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. పాలు కాగాక అందులో కస్టర్డ్ పౌడర్, చక్కెర వేసి బాగా కలపాలి. పాలు గోరువెచ్చగా అయ్యాక అందులో ఖర్జూర గుజ్జు కలిపి, జీడిపప్పు పలుకులు వేసి గార్నిష్ చేస్తే డేట్స్ డిజర్ట్ రెడీ.