పెళ్లి కుదిరాక కూతురి నిర్వాకం.. సూసైడ్ చేసుకున్న తల్లిదండ్రులు

V6 Velugu Posted on Apr 21, 2021

  • పెళ్లి ఇష్టం లేక ఇంట్లోంచి వెళ్లిపోయిన కూతురు.. 
  • మనస్థాపంతో తల్లిదండ్రుల సూసైడ్

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని మనస్థాపంతో తల్లిదండ్రులు సూసైడ్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కంది మండలంలో వెలుగుచూసింది. నారాయణ, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. నారాయణ జిన్నారంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా.. ఈ మధ్యే నారాయణ పెద్ద కూతురికి పెళ్లి నిశ్చయమైంది. అయితే ఆ పెళ్లి ఇష్టంలేని యువతి రెండు రోజుల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దాంతో తల్లిదండ్రులిద్దరూ తీవ్రంగా కుమిలిపోయారు. పెళ్లి కుదిరిన తర్వాత అమ్మాయి ఇంట్లోంచి ఎక్కడికో వెళ్లిపోయిందని.. ఈ విషయం బంధువులకు తెలిస్తే పరువు పోతుందని ఆ తల్లిదండ్రులు భావించారు. పరువు పోయిన తర్వాత బతకడం కన్నా చావడం మేలని దంపతులిద్దరూ స్థానికంగా ఉన్న కైలాష్ గార్డెన్స్ ఆవరణలో ఒకే చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయారు. బుధవారం ఉదయం గమనించిన గార్డెన్ సిబ్బంది.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Tagged Telangana, Sangareddy, Constable suicide, Jinnaram, , parents suicide

Latest Videos

Subscribe Now

More News