సీనియర్‌‌ సిటిజన్స్‌‌ కోసం డే కేర్‌‌ సెంటర్స్‌‌

సీనియర్‌‌ సిటిజన్స్‌‌ కోసం డే కేర్‌‌ సెంటర్స్‌‌

సీనియర్‌‌ సిటిజన్స్‌‌ కోసం
డే కేర్‌‌ సెంటర్స్‌‌కొత్త స్కీమ్‌‌ తెస్తం: కేంద్రం

న్యూఢిల్లీ: సీనియర్‌‌ సిటిజన్స్‌‌ కోసం డే కేర్‌‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం బుధవారం పార్లమెంట్‌‌లో ప్రకటించింది. సెంటర్స్‌‌ వరకు రాలేని వాళ్లకు ఎన్జీఓలతో ఇంటి వద్దే సర్వీస్‌‌ అందించేలా మరో ప్రోగ్రామ్‌‌నూ ప్లాన్‌‌ చేస్తున్నట్టు తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 10.38 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారని సోషల్‌‌ జస్టిస్‌‌, ఎంపవర్‌‌మెంట్‌‌ మినిస్టర్‌‌ తౌవార్ చంద్ గెహ్లాట్ తెలిపారు. సీనియర్‌‌ సిటిజన్లను చూసుకోవడంపై 2007లోనే చట్టం ఉందని, దాని కంటే మెరుగైన చట్టం తీసుకొస్తున్నామని వెల్లడించారు.

సీనియర్‌‌ సిటిజన్స్‌‌ డే కేర్‌‌ సెంటర్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గడపొచ్చని.. లైబ్రరీ, క్యాంటీన్‌‌తోపాటు ఇతర సౌకర్యాలు ఉంటాయన్నారు.  ఒంటరిగా ఉంటూ, కనీస అవసరాలు తీర్చుకోలేని వాళ్లకు వారి ఇంటి వద్దే ఎన్జీఓల సాయంతో సేవలు అందించే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన స్కీమ్‌‌ కింద అర్హులకు రూ.7 వేల విలువైన పరికరాలు అందిస్తున్నామని చెప్పారు.