ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన మెక్‌‌గర్క్‌‌ ప్లేస్‌‌లో ముస్తాఫిజుర్‌‌

ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన మెక్‌‌గర్క్‌‌ ప్లేస్‌‌లో ముస్తాఫిజుర్‌‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన ఆస్ట్రేలియా క్రికెటర్ జాక్‌‌ ఫ్రేజర్‌‌ మెక్‌‌గర్క్‌‌ ప్లేస్‌‌లో బంగ్లాదేశ్‌‌ సీమర్‌‌ ముస్తాఫిజుర్‌‌ రెహమాన్‌‌ను జట్టులోకి తీసుకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తెలిపింది. మెక్‌‌గర్క్‌‌ ఈ సీజన్‌లో ఆడిన తొలి ఆరు మ్యాచ్‌‌ల్లో అతను కేవలం 55 రన్స్‌‌ మాత్రమే చేశాడు. మిచెల్‌‌ స్టార్క్‌‌ రాకపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ముస్తాఫిజుర్‌‌ను డెత్‌‌ ఓవర్లలో ఉపయోగించుకోవాలని డీసీ భావిస్తోంది.

2016లో ఐపీఎల్‌‌ అరంగేట్రం చేసిన ముస్తాఫిజుర్‌‌ 2022, 2023లో డీసీకి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌‌ కెరీర్‌‌లో 38 మ్యాచ్‌‌లు ఆడిన ముస్తాఫిజుర్‌‌ 7.84 ఎకానమీతో 38 వికెట్లు తీశాడు. శనివారం నుంచి మొదలయ్యే మిగతా ఐపీఎల్‌‌ మ్యాచ్‌‌లకు ముస్తాఫిజుర్‌‌ అందుబాటులో ఉంటాడని డీసీఫ్రాంచైజీ బుధవారం వెల్లడించింది. అయితే, ఈ నెల 17, 19వ తేదీల్లో యూఏఈతో బంగ్లాదేశ్ పోటీపడే  రెండు టీ20ల సిరీస్ కోసం ముస్తాఫిజుర్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు.