భారీగా చనిపోయిన గబ్బిలాలు

భారీగా చనిపోయిన గబ్బిలాలు

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో భారీ సంఖ్యలో గబ్బిలాలు చనిపోయాయి.  బేల్ ఘాట్  అనే పట్టణంలో… 50కి పైగా  గబ్బిలాలు చనిపోవడం కలకలం రేపింది. గబ్బిలాల నుంచే కరోనా వైరస్ వ్యాపించిందన్న ప్రచారంతో స్థానికులు భయపడుతున్నారు. స్పాట్ ను  పరిశీలించిన  జిల్లా అటవీ శాఖ అధికారులు గబ్బిలాల మృతికి కారణాలను అన్వేషిస్తున్నారు.

ఎండలు విపరీతంగా ఉండడం, ఆహారం, తాగు నీరు దొరక్కపోవడంతోనే గబ్బిలాలు చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గబ్బిలాలను బరేలీలోని  ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు పంపించారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.

For More News..

నచ్చిన కోర్సులో సీటు రాక.. ఇష్టంలేని కోర్సు చదవలేక..

భూములు పాయే..  ప్రాజెక్టు పాయే.. కొలువులు రాకపాయే..

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి