
- రిమోట్ ద్వారా పెట్రోల్, డీజిల్ కొలతల ఆపరేట్
- సిటీలోని పలు బంకుల్లో కొందరు డీలర్ల మోసాలు
- సివిల్ సప్లయ్ ఎన్ ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెలుగులోకి..
- నాసిల్స్కు కూడా స్టాంపింగ్చేయించని నిర్వాహకులు
హైదరాబాద్,వెలుగు : సిటీలో కొందరు పెట్రోల్‌బంకుల డీలర్లు చేతివాటం చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండికొడుతున్నారు. బంకుల్లోని డిస్పెన్సర్మెషీన్లకు ఉండే నాసిల్స్(గన్)కు స్టాంపింగ్ అప్ డేట్ చేయించడం లేదని తేలింది. ఇటీవల సివిల్‌సప్లయ్ డిపార్ట్ మెంట్ స్పెషల్‌డ్రైవ్‌లో ఇలాంటి అక్రమాలు వెలుగు చూశాయి. ప్రతి పెట్రోల్బంకులోని మెషీన్లకు నాసిల్స్(గన్) అమర్చి వాటి ద్వారానే వాహనాలకు పెట్రోల్, డీజిల్పోస్తుంటారు. ఆ నాసిల్స్ కు ప్రతి ఏడాది తూనికలు కొలతల శాఖ ద్వారా అప్ డేట్ స్టాంపింగ్చేయించాలి. అలా చేయించాలంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. దీంతో స్టాంపింగ్చేయించకుంటే పెట్రోల్, డీజిల్పోసేటప్పుడు కొలతల్లో తేడా వస్తుంది. మరోవైపు కొందరు డీలర్లు డిస్పెన్సర్ మెషీన్ లో చిప్‌ను అమర్చుతున్నారు. రిమోట్ ను చేతిద్వారా ఆపరేట్ చేస్తుంటారు. దీంతో కూడా కస్టమర్లకు పోసే పెట్రోల్, డీజిల్కొలతల్లో తేడా వస్తుంది. తనిఖీల్లో మెషీన్ లో చిప్ఏర్పాటు చేయడం, మరికొన్ని కేసుల్లో నాసిల్స్కు స్టాంపింగ్చేయించకపోవడం వంటి అక్రమాలు బయటపడుతున్నట్టు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. వాహనదారుల కంటికి కనిపించకుండా కొందరు డీలర్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు.
అప్ డేట్ చేయించకుండా అక్రమాలు
కొందరు పెట్రోల్‌బంకుల నిర్వాహకులు మెషీన్లలో చిప్పెట్టి రిమోట్ద్వారా ఆపరేట్‌చేస్తూ వాహనదారులను మోసగిస్తున్నారు. నాసిల్ద్వారా పెట్రోలు, డీజిల్ పోసేటప్పుడు మెషీన్ నెంబర్లు చాలా స్పీడ్ గా తిరుగుతుంటాయి. అప్పటికే మెషీన్ లో అమర్చిన రిమోట్ ను నిర్వాహకులు చేతితో ఆపరేట్చేస్తుండగా.. పెట్రోల్, డీజిల్కొలతల్లో తేడా వస్తుంది. ప్రతి ఏడాది నాసిల్స్కు స్టాంపింగ్అప్ డేట్ చేయించకపోగా టెక్నికల్‌గా టాంపరింగ్చేస్తున్నట్టు తెలిసింది. కొందరు నాసిల్కు ఉండే ప్లాస్టిక్ముద్రను తొలగిస్తుండగా.. తద్వారా టాంపర్అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అక్రమాలతో వాహనదారులకు తీవ్ర నష్టం జరుగుతుందని సివిల్‌సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్పేర్కొన్నారు. స్పెషల్‌డ్రైవ్‌లో చాలా బంకుల్లో నాసిల్స్టాంపింగ్చేయనివే ఎక్కువగా బయటపడుతున్నాయని తెలిపారు. ఇటీవల బీఎన్‌రెడ్డి నగర్లో స్టాంపింగ్చేయని మూడు పెట్రోల్‌బంకులపై కేసు నమోదు చేసినట్టు, మరికొందరికి షోకాజ్‌నోటీసులు జారీ చేసినట్టు ఆయన చెప్పారు.
రోజుకు లక్షల లీటర్ల అమ్మకాలు
సిటీలో పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను అరికట్టడడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తూనికలు, కొలతల శాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారని, ఇందుకు బంకుల నిర్వాహకులతో ములాఖత్ అయి ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సిటీలో నాసిల్స్టాంపింగ్చేయించుకోని బంకులపై కేసులు ఏటేటా పెరుగుతున్నాయి. సివిల్‌సప్లయ్ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నా.. కేవలం వార్నింగ్లతోనే సరిపెడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలో 850 పెట్రోల్‌బంకులు ఉన్నాయి. ఘట్కేసర్, చర్లపల్లి తదితర ఆయిల్కంపెనీల డిపోల నుంచి రోజుకు 20లక్షల లీటర్ల పెట్రోల్, మరో 20 లక్షల లీటర్ల డీజిల్ ను సరఫరా చేస్తున్నారు. డీలర్లకు కమీషన్ వస్తున్నా కూడా అక్రమాల ద్వారా కూడా కొందరు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
తమిళనాడు విధానం అమలు చేస్తే..
పెట్రోల్ బంకుల నిర్వాహకులు నాసిల్స్టాంపింగ్ చేయించకుండా ఫీజును ఎగ్గొడుతున్నారని తమిళనాడులో నేరుగా ఆయిల్కంపెనీలే ఫీజులను చెల్లిస్తాయి. ఆ తర్వాత డీలర్ల నుంచి తిరిగి పొందే విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాంటి విధానమే తెలంగాణలోనూ అమలు చేస్తే నాసిల్స్టాంపింగ్ ఫీజును ఎగ్గొట్టడానికి చాన్స్ ఉండదని కొందరు డీలర్లు పేర్కొంటున్నారు. రిమోట్ చిప్‌లను ఏర్పాటు చేసి పెట్రోల్, డీజిల్కొలతల్లో అక్రమాలకు పాల్పడే నిర్వాహకులపై కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది.