రివ్యూ: డియర్ మేఘ

రివ్యూ: డియర్ మేఘ

రివ్యూ: డియర్ మేఘ
రన్ టైమ్ :2 గంటలు
నటీనటులు : అదిత్ అరుణ్,మేఘ ఆకాష్,అర్జున్ సోమయాజులు,పవిత్రా లోకేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ
మ్యూజిక్ : హరి గౌర
నిర్మాత : అర్జున్ దాస్యన్
రచన,దర్శకత్వం: సుశాంత్ రెడ్డి
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 3,2021

కథేంటి?

మేఘ (మేఘ ఆకాష్) కాలేజ్ లో చదువుతున్నప్పుడు అర్జున్ (అర్జున్ సోమయాజులు) ను చూసి ఇష్టపడుతుంది.ఆమెది వన్ సైడ్ లవ్. తర్వాత కొన్నేళ్ల తర్వాత వాళ్లిద్దరూ ఒకటవుతారు.కానీ ఓ యాక్సిడెంట్ లో అర్జున్ చనిపోతాడు.అది మరిచిపోయేందుకు మేఘను వేరే ఊరు పంపిచేస్తారు పేరెంట్స్.అక్కడ ఆది (అదిత్ అరుణ్) పరిచయమవుతాడు.తాను ధైర్యం చెప్తాడు.ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఏర్పడింది? తర్వాత మేఘ లైఫ్ లో జరిగిన మార్పులేంటి అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:

అదిత్ అరుణ్ మంచి ఈజ్ ఉన్న యాక్టర్. స్క్రీన్ మీదకు లేట్ గా ఎంట్రీ ఇచ్చినా..తనదైన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో అందర్నీ డామినేట్ చేసేసాడు.మేఘ ఆకాష్ కు మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ దక్కింది.తను తన పాత్రకు న్యాయం చేసింది.మరో హీరో అర్జున్ సోమయాజులు ఫర్వాలేదనిపించాడు.తల్లి పాత్రలో పవిత్రా లోకేష్ ఒదిగిపోయింది.

టెక్నికల్ టీమ్

ఈ సినిమాకు ఆండ్రూ కెమెరా పనితనం ప్లస్ అయింది. అందమైన విజువల్స్ తో స్క్రీన్ ను బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దాడు.హరి గౌర తన మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పోసాడు.పాటలు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా అయ్యాక కూడ గుర్తుండిపోతాయి.ఎడిటింగ్ బాగుంది.ప్రొడక్షన్ వాల్యూయ్స్,ఆర్ట్ వర్క్ అన్ని చక్కగా కుదిరాయి.నిర్మాత అర్జున్ దాస్యన్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రిచ్ గా తీసాడు.డైలాగులు బాగున్నాయి.

విశ్లేషణ:

‘డియర్ మేఘ’’ ఎమోషనల్ లవ్ స్టోరీ.హీరోయిన్ పాత్ర పరంగా కథ సాగుతుంది. తన లైఫ్ లో జరిగే సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది.కన్నడలో హిట్ అయిన ‘‘దియా’’ కు ఇది రీమేక్. కథ పాతదే అయిన ట్రీట్ మెంట్ ఫ్రెష్ గా సాగుతుంది. డైరెక్టర్ సుశాంత్ రెడ్డి తెలుగులో ఈ కథను తెలుగు ప్రేక్షకులకు చెప్పాలనుకున్న ఐడియా బాగుంది.కథనం పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సింది.అక్కడక్కడా కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా సాగుతుంది.సెకండాఫ్ ఫన్ గా సాగుతుంది.చివరి అరగంట ఎమోషన్ బాగా పండింది.మదర్ సెంటిమెంట్,క్లైమాక్స్ కట్టిపడేస్తాయి.ఓవరాల్ గా ‘‘డియర్ మేఘ’’ ఫర్వాలేదనిపిస్తుంది.ఒరిజినల్ చూసిన వాళ్లకు ఓకే అనిపించినా..చూడనివాళ్లకు మాత్రం బాగా నచ్చుతుంది.

విశ్లేషణ: ఎమోషనల్ లవ్...