బడ్జెట్ అప్‌డేట్స్: బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం

బడ్జెట్ అప్‌డేట్స్: బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం

ఈసారి బడ్జెట్‌లో బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు తీసుకొచ్చారు. దేశంలో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్పీఏలు, మొండిబకాయిలను బ్యాడ్ బ్యాంకుకు తరలించాలని నిర్ణయించారు. బ్యాంకులు ఖాతాలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయోచ్చని కేంద్రం ఆలోచిస్తోంది.

ముఖ్యాంశాలు

హెల్త్ కేర్ రంగం కోసం రూ. 2,23,846 కోట్లు

కరోనా వ్యాక్సిన్ కోసం 35 వేల కోట్లు కేటాయించారు.

అర్బన్ స్వచ్ఛ్ భారత్ మిషన్ కోసం రూ. 1,41,678 కోట్లు

మూడేళ్లలో ఏడు టెక్స్‌టైల్స్ పార్కులను అభివృద్ధి చేస్తాం.

రక్షిత మంచినీటి పథకానికి రూ.87 వేల కోట్లు

జిల్లాకో హెల్త్ ల్యాబ్

జలజీవన్ మిషన్‌కు రూ. 2.87 లక్షల కోట్లు

వాయుకాలుష్యం నివారణకు రూ.2,217 కోట్లు

మార్చి 22 కల్లా 8,500 కిలోమీటర్ల అదనపు హైవేలు

మెట్రో, బస్ స్టాప్‌ల నిర్మాణానికి రూ. 18 వేల కోట్లు

రైల్వేలకు రూ. 1.15 లక్షల కోట్లు

15 ఎమర్జెన్సీ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటు.

ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌ఢీఐల పరిమితి 49శాతం నుంచి 74 శాతానికి పెంపు.

రహదారుల అభివృద్ది కోసం భారతమాల పథకం

రోడ్లు, హైవేల కోసం రూ. 1.18 లక్షల కోట్లు

మెట్రో న్యూ, మెట్రో లైట్ పేరుతో కొత్త ప్రాజెక్టులు