
హాలియా, వెలుగు: నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం నుంచి 1,33,604 క్యూసెక్కుల వరద వస్తుండడంతో సాగర్ వద్ద 10 గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి 78,270 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి కుడికాల్వకు 10,040 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,896, వరద కాల్వకు 300, ఏఎమ్మార్పీకి 2,400, మెయిన్ పవర్ హౌస్‌కు 33,698 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.