Good Health : డీప్ టిష్యూ మసాజ్.. స్పోర్ట్స్ పర్సన్స్ చేయించుకునే ఈ మాసాజ్తో హుషారు

Good Health : డీప్ టిష్యూ మసాజ్.. స్పోర్ట్స్ పర్సన్స్ చేయించుకునే ఈ మాసాజ్తో హుషారు

డీప్ టిష్యూ మసాజ్ వల్ల శరీరానికి రిలాక్సేషన్తో పాటు కొన్ని వ్యాధులు కూడా నయమవుతాయి. పేరు కొత్తగా ఉంది కదా !కానీ వ్యాయామశాలల్లో.. స్పోర్ట్స్ అకాడమీల్లో ఈ మసాజ్ పేరు పరిచయమే.

ఇంటి పనుల వల్ల అలసిపోతే శరీరానికి విశ్రాంతి కావాలి అనిపిస్తుంది. అలాగే పని ఒత్తిడి ఎక్కువై మెదడుకు రిలీఫ్ కావాలంటే మసాజ్ చేయించుకుంటారు. ఒక్కో రకమైన సమస్యకు ఒక్కో రకమైన మసాజ్ ఉంది. డీప్ టిష్యూ మసాజ్ చేయించుకునే వాళ్లలో మాత్రం ఆటల పోటీలలో పాల్గొనే వాళ్లు, దీర్ఘకాలిక కండరాలు నొప్పులతో బాధపడేవాళ్లు ఎక్కువగా ఉంటారు.

ఎవరికి ఎక్కువగా..

వ్యాయామం ఎక్కువగా చేస్తే ఒక్కోసారి కండరాలు పట్టుకుపోయి నొప్పి పుడతాయి. ఎన్నిమందులు వాడినా ఆ నొప్పి తగ్గకపోవచ్చు. ఆటలు ఆడేటప్పుడు కింద పడటం వల్ల దెబ్బలు తగలొచ్చు. కొన్నిసార్లు శరీరానికి గాయం కాకుండా కండరాలకు మాత్రమే దెబ్బ తగిలి నొప్పి కలగొచ్చు. ఆ నొప్పి ఎక్కువ రోజులు ఇబ్బంది పెడుతుంది. ఇటువంటి వాళ్లకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది డీప్ టిష్యూ మసాజ్. ముఖ్యంగా వెన్నెముక కింది భాగంలో నొప్పితో ఇబ్బంది పడేవాళ్లు.

ఇంకా క్రానిక్ పెయిన్, కండరాల అస్థిరత్వం, మెడ పట్టేయడం, మోచేతుల దగ్గర నొప్పి, ఆస్తమా సమస్య, సయాటికా నొప్పులు ఉన్న వాళ్లు ఈ మసాజ్ థెరపీని ఎంచుకుంటారు. మెదడులో 'అమిగ్దల' అనే 'హెచ్ఆర్డుఎ' న్యూరాన్ల కేంద్రం ఉంది. ఆ న్యూరాన్లు ఆహార నియంత్రణ చేస్తాయి. అవి సరిగా పనిచేయకపోతే ఎంత తిన్నా ఆకలి తీరదు, ఇంకా తినాలనిపిస్తుంది. ఈ సమస్య కూడా ఈ మసాజ్ వల్ల దూరమై రిలీఫ్ పొందుతారు. దీర్ఘకాలంగా ఉండే కండరాల నొప్పులను ఫైబ్రోమయాల్జియా అంటారు. వీటిని తగ్గించడానికి ఈ మసాజ్ ఎంతో ఉపయోగపడుతుంది.

ఎలా చేస్తారు? ఏ నూనెలు వాడతారు

వివిధ నూనెలు ఉపయోగించి ఈ మసాజ్ చేస్తారు. రకరకాల హ్యాండ్ స్ట్రోక్స్ నొప్పి ఉన్న ప్రదేశాల్లో తక్కువ ఒత్తిడి ఇస్తూ మర్దన చేస్తారు. అల్లంతో తయారు చేసిన నూనె, ఆర్నికా, ఎసెన్షియల్ నూనెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నూనెలు చర్మం లోపలికి చొచ్చుకు పోవడం వల్ల నొప్పులు తగ్గడమే కాదు చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ఈ మసాజ్ కూడా పని చేస్తుంది.

ఉపయోగాలు

• కండరాల నొప్పులు తగ్గుతాయి.

౦ యవ్వనంగా ఉంటారు, హుషారుగా పని చేస్తారు.
౦ ఎముకలకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. 
O దీర్ఘకాలిక బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. 
O బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. 
౦ ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. 
౦ మెదడులోని రక్త కణాల సంకోచ వ్యాకోచాలను అదుపు చేస్తూ లింబిక్ సిస్టమ్ (ఆలోచనా విధానం) ను క్రమబద్ధం చేస్తుంది.

ఈ మసాజ్ వల్ల సాధారణంగా ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. మసాజ్ చేసాక నొప్పులు ఎక్కువై రెండు రోజులైనా తగ్గకపోతే ఐస్తో మెల్లిగా మర్దన చెయ్యాలి. అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ నా సంప్రదించాలి. అందుకే డాక్టర్ సలహా మీదనే ఈ మసాజ్ చేయించుకోవాలి.