Deepthi Sunaina: దీప్తి ప్రాణం తనలోనే ఉందట.. ఈ లేటెస్ట్ పోస్ట్ ఎవరికోసమో!

Deepthi Sunaina: దీప్తి ప్రాణం తనలోనే ఉందట.. ఈ లేటెస్ట్ పోస్ట్ ఎవరికోసమో!

ప్రముఖ యూట్యూబర్ దీప్తి సునైన(Deepthi Sunaina) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ లో ప్రయివేట్ సాంగ్స్, కవర్ సాంగ్స్, సిరీస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 2లో అడుగుపెట్టింది దీప్తి. ఇక బిగ్ బాస్ తరువాత సోషల్ మీడియాలో ఫుల్ ఫేమ్ సంపాదించిన దీప్తి.. మరో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి నెటిజన్స్ కు షాకించింది. 

ఆతరువాత కొన్నాళ్ళకు షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసి ప్రస్తుతం సింగల్ గానే ఉంటోంది ఈ బ్యూటీ. ఈ మధ్యలో కూడా ఆమె నుండి మంచి మంచి ప్రైవేట్ సాంగ్స్ వచ్చాయి. వాటికి ఆడియన్స్ నుండి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటు ప్రైవేట్ సాంగ్స్ తో ఫుల్ బిజీగా ఉంటూనే.. మరోపక్క తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో నెటిజన్స్ కుక్ నిద్ర లేకుండా చేస్తోంది. ఇక తాజాగా మరో ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె పర్పుల్ కలర్ సారీలో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. 

ఇక్కడివరకు బాగానే ఉంది కానీ, ఆ ఫోటోలకు దీప్తి ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. తన ఫోటోలకు నీలో ఉంది నా ప్రాణం అని నీకు తెలుసునా.. అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ క్యాప్షన్ పై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. నీ ప్రాణం తనలో ఉందా ఎవరు అతను అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో,, దీప్తి మళ్ళీ ప్రేమలో పడినట్టుంది.. అందుకే ఇలాంటి పోస్ట్ లు పెడుతోంది.. అని అంటున్నారు. మరి దీప్తి ఎందుకు ఆ క్యాప్షన్ పెట్టిందో తెలియదు కానీ, ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.