
దేశవ్యాప్తంగా ఆర్మీ అధికారులు సివిలీయన్స్తో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు. నంద్యాల జిల్లా పోలీస్ ఉన్నతాధికారి అధిరాజ్ సింగ్ రాణా నేతృత్వంలో అహోబిలం దేవస్థానం పరిసరాల్లో డిఫెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది.. పోలీసు శాఖ.. అగ్నిమాపక శాఖ.. వైద్యాధికారులు.. స్థానికులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను రక్షించేందకు .. ఉద్యోగులు.. స్థానికులు ఎలా స్పందించాలో ఈ డ్రిల్ద్వారా ప్రదర్శించారు.