సుశాంత్ సింగ్ డెత్ మిస్ట‌రీ : ఒక్క ఫోన్ కాల్ తో క‌థ సెక‌న్ల‌లో అడ్డం తిరిగింది

సుశాంత్ సింగ్ డెత్ మిస్ట‌రీ : ఒక్క ఫోన్ కాల్ తో క‌థ సెక‌న్ల‌లో అడ్డం తిరిగింది

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం ద‌ర్యాప్తు కేసులో పోలీసుల‌కు పోలీసులే షాక్ ఇస్తున్నారు.

బీహార్ పోలీసులు సుశాంత్ మ‌ర‌ణంలో అనుమానస్ప‌ద వ్యక్తుల్ని విచారిస్తున్నారు. విచార‌ణ‌లో సుశాంత్ మాజీ మేనేజ‌ర్ దిషా సాలియ‌న్ మ‌ర‌ణం , సుశాంత్ అనుమానాస్ప‌దంగా మృతి చెందిన రోజు గ‌ది డోర్ ను ఓపెన్ చేసిన కీ మేక‌ర్, దిషా సాలియ‌న్ కుటుంబ‌స‌భ్యుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా బీహార్ పోలీసులు దిషా సాలియ‌న్ మ‌ర‌ణంపై కేసు న‌మోదైన ముంబైలోని మ‌ల్వానీ పోలీస్ట్ స్టేష‌న్ ను విజిట్ చేశారు. ఈ సంద‌ర్భంగా దిషా కేసు డేటా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. అందుకు మ‌ల్వానీ కేసు ద‌ర్యాప్తు చేస్తున్న అధికారి డేటా ఇచ్చేందుకు సిద్ధ‌మయ్యారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు ఫోన్ కాల్ రావ‌డంతో క‌థ అడ్డం తిరిగింది. డేటా ఇస్తాన‌న్న అధికారి నిమిషాల్లో మాట మార్చి.. సారీ అనుకోకుండా దిషా సాలియన్ కేసు ద‌ర్యాప్తు డేటా డిలీట్ అయ్యింద‌ని చావుకబురు చ‌ల్ల‌గా చెప్పారు.

అయితే తాము డిలీట్ అయిన డేటాను రీక‌లెక్ట్ చేస్తామ‌ని బీహార్ పోలీసులు స‌ద‌రు ముంబై పోలీసు అధికారి చెప్ప‌గా కంప్యూట‌ర్ యాక్స్ స్ ఇచ్చేందుకు అనుమ‌తి లేద‌ని చెప్పారు.

ఇదిలావుండ‌గా బీహార్ పోలీసులు దిషా సాలియ‌న్ కుటుంబ‌స‌భ్యుల వాంగ్మూలం తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఇంట్లో ఎవ‌రు లేర‌ని పోలీసులు తెలిపారు. వీరితో పాటు సుశాంత్ అనుమానస్ప‌ద మ‌ర‌ణం త‌రువాత ఆయ‌న గ‌ది డోర్ ను ఓపెన్ చేసిన కీ మేక‌ర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయ‌నున్నారు.

ఇదిలా ఉండగా మ‌హ‌రాష్ట్ర పోలీసుల తీరుతో ఈ కేసు దర్యాప్తుకు నాయకత్వం వ‌హిస్తున్న బీహార్ పాట్నా ఎస్పీ వినయ్ తివారీ ముంబైకి బయలుదేరారు.