ఢిల్లీలో ఆటో, టాక్సీ చార్జీల పెంపు

ఢిల్లీలో ఆటో, టాక్సీ చార్జీల పెంపు

ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ ధర పెరగడంతో ఢిల్లీలో ఆటో, టాక్సీ ఛార్జీల పెంచింది. ఆప్ ప్రభుత్వం ఆమోదించిన రేట్లకు సంబంధించి ఢిల్లీ రవాణాశాఖ ప్రకటన చేసింది. కొత్తగా సవరించిన ధరల ప్రకారం.. ఆటో కిలో మీటర్ కనీస ఛార్జీని రూ. 25కి నుంచి రూ. 30 కి పెంచింది. ఆ తర్వాత ప్రతి కిలో మీటరుకు ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ. 9.50 పైసలకు బదులుగా రూ.11 చెల్లించాల్సి ఉంటుంది. 

ఇక టాక్సీలకు.. ఏసీ,నాన్ ఏసీలకు వేర్వేరుగా రేట్లు నిర్ణయించారు. టాక్సీలలో కనీస ధర రూ.40గా నిర్ణయించింది. నాన్ ఏసీ ట్యాక్సీలకు ప్రస్తుతం కిలో మీటరుకు రూ.17 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ మొత్తం కిలోమీటరుకు రూ.14 గా ఉండేది. ఇక ఏసీ ట్యాక్సీ ఛార్జీని కిలో మీటరుకు రూ.16 నుంచి రూ.20కి పెంచింది. ప్రభుత్వం ఆటో ఛార్జీలను 2020లో.. టాక్సీ చార్జీలు 2013 సవరించారు.