ఢిల్లీ ముఖ్యమంత్రికి బెదిరింపులు.. బీజేపీ నేత అరెస్ట్‌

ఢిల్లీ ముఖ్యమంత్రికి బెదిరింపులు.. బీజేపీ నేత అరెస్ట్‌

ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్‌ సింగ్‌ బగ్గాను పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను చంపేస్తానని వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను అరెస్ట్‌ చేశారు. ఈ ఏడాది మార్చి 30వ తేదీన జరిగిన నిరసన ప్రదర్శనలో ఆప్‌ చీఫ్‌ అరవింద్ కేజ్రీవాల్‌ను బగ్గా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలను ఆప్‌ నేతలు పోలీసులకు అందజేశారు. దీంతో తజిందర్‌ సింగ్‌ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై బగ్గాను అరెస్టు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

తన రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకే సీఎం కేజ్రీవాల్‌ అరెస్టులు చేయిస్తున్నారంటూ ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి కపిల్‌ మిశ్రా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తల కోసం.. 

రాహుల్ పర్యటనపై కేటీఆర్, కవిత ప్రశ్నలు

26 ఏళ్లుగా ప్రజలకు దాహం తీరుస్తున్న వాటర్ మ్యాన్