
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. జూన్ 10న ద్వారకా సెక్టార్-13లోని శబ్ద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక అంతస్తు మొత్తాన్ని కప్పేశాయి. చాలా మంది బిల్డింగ్ లో చిక్కుకున్నారు. అయితే మంటల నుంచి తప్పించుకోవడానికి భవనంపై నుంచి ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి కిందకు దూకారు. తీవ్ర గాయలైన వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు వ్యక్తులు ఇంకా లోపల చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పుతున్నారు.
అగ్నిప్రమాదంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ను వెంటనే ఖాళీ చేయించారు అధికారులు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు లోపల చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు ముగ్గురు మరణించినట్లు తెలిపారు. పోలీసు బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
►ALSO READ | ఉద్యోగం పేరుతో యువతికి నరకం : అశ్లీల వీడియోల్లో నటించాలంటూ చిత్రహింసలు
మంటలు ఇతర అంతస్తులకు వేగంగా వ్యాపిస్తుండటంతో నివాసితులు తమ సామాగ్రి గురించి ఆందోళన చెందుతున్నారు. సమీపంలోని భవనాల్లో నివసించే ప్రజలు కూడా మంటలు తమ ఇళ్లకు చేరుకుంటాయనే భయంతో ఉన్నారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.