ఆ వీడియో తొలగించండి : కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఆ వీడియో తొలగించండి : కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్ భార్య సునీతకు హైకోర్టు నోటీసులిచ్చింది.కేజ్రీవాల్ కోర్టులో మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల  నుంచి తొలగించాలని నోటీసులు జారీచేసింది.  తదుపరి విచారణకు జూలై 9న విచారిస్తామని చెప్పింది. 

 మార్చి 28న కేజ్రీవాల్ ట్రయల్ కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడు కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్.. కోర్టు ప్రొసిడింగ్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీనిని మరికొందరు రీ పోస్ట్ చేశారు.  దీనిపై  న్యాయవాది వైభవ్ సింగ్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు రూల్స్ ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ  పిటిషన్ ను విచారించిన  జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ, అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం కోర్టు ప్రొసిడింగ్స్‌ను  ఉల్లంఘించనట్లు అవుతుందని కోర్టు తప్పుబట్టింది.

సునీతా కేజ్రీవాల్ తో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసింది. ఇలాంటి కంటెంట్ మళ్లీ పోస్ట్ చేసినట్లు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని తొలగించాలని సోషల్ మీడియా మధ్యవర్తులను కూడా హైకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణను జూలై 9 కి వాయిదా వేసింది.