ఈనెల 13 వరకు ఈడీ కస్టడీలోనే సత్యేంద్ర జైన్ 

ఈనెల 13 వరకు ఈడీ కస్టడీలోనే సత్యేంద్ర జైన్ 

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఈ నెల 13 (జూన్ 13, సోమవారం) వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉండనున్నారు. 

ఇటీవలే మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ. 2.82 కోట్ల నగదు, 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సత్యేంద్ర జైన్ భార్య, కుమార్తెలకు మెమోలను ఈడీ అధికారులు అందచేశారు. 2015, 16లో కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీతో జైన్ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. గత నెల 30న జైన్ ను అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. వాటాదారుగా ఉన్న నాలుగు కంపెనీలకు వచ్చిన మూలాన్ని ఆయన వివరించలేదని, అనేక కంపెనీలను కొనుగోలు చేసి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. అయితే.. ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖండిస్తున్నారు. అవన్నీ అబద్దాలేనని, ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూడలేక, దాడులు చేస్తున్నారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.