సంజయ్ సింగ్‌కు బిగ్ షాక్.. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

సంజయ్ సింగ్‌కు బిగ్ షాక్..  పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయిన ఆప్ నేత సంజయ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టులో  చుక్కెదురైంది.  తన అరెస్ట్ , రిమాండ్‌ను సవాలు చేస్తూ గత వారం హైకోర్టును ఆశ్రయించారు సంజయ్ సింగ్‌. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం..  సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.  

ఈ కేసులో తాను కేవలం అనుమానితుడినే కానీ నిందితుడిని కాదని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ  సంజయ్ సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.   అయితే  రిమాండ్, అరెస్టు ఉత్తర్వలో తాము జోక్యం చేసుకునేందుకు,  తగిన కారణం కనిపించడం లేదంటూ స్వర్ణకాంత శర్మతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు విచారణలో ఉన్న పరిస్థితిలో ముందస్తుగా జోక్యం చేసుకోలేమనితెలిపింది.

మనీలాండరింగ్ కేసులో  అక్టోబర్‌ 4న ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ అమలు చేయడంలో సంజయ్  సింగ్ కీలక పాత్ర పోషించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.