త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈడీ తనిఖీలు చేసే చాన్స్

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈడీ తనిఖీలు చేసే చాన్స్
  • 5 జిల్లాల్లో 8 మంది బినామీల గుర్తింపు 
  • వీరిలో ప్రముఖ నేతకు చెందిన నలుగురు సిబ్బంది 
  • గ్రామీణ ప్రాంతాల్లోని అకౌంట్లకు పెద్ద మొత్తంలో డబ్బులు 

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో బినామీ నెట్​వర్క్​పై ఈడీ ఫోకస్ పెట్టింది. షెల్ కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్న బినామీల వివరాలు రాబడుతోంది. వీరిలో ఓ ప్రముఖ నేతకు చెందిన ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పర్సనల్‌‌ అసిస్టెంట్లు సహా మొత్తం 8 మంది ఉన్నట్లు ఈడీ ఆధారాలు సేకరించిందని తెలిసింది. కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, సిద్దిపేట, వేములవాడ, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ కు చెందిన ఈ 8 మంది వివరాలను సేకరించినట్లు సమాచారం. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, గత పదేండ్లలో వారి అకౌంట్లలో డిపాజిట్స్‌‌‌‌‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్స్‌‌‌‌‌‌‌‌ వివరాలను సేకరించినట్లు తెలిసింది. పూర్తి ఆధారాలతో మరో వారంలో  రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం తమ లిస్టులో ఉన్న అనుమానితులు, బినామీలు, వారి ఆస్తులు, ఖర్చుల వివరాలను ఈడీ ఇప్పటికే సేకరించిందని సమాచారం. 

నాలుగు అకౌంట్లలో డిపాజిట్...  

ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు చేపట్టిన ఈడీ.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. వాటి ఆధారంగా షెల్ కంపెనీల బినామీ డైరెక్టర్లను గుర్తించింది. వీరిలో ప్రముఖ నేతకు చెందిన సిబ్బంది ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓసీ) రికార్డుల్లో పేర్కొన్న అడ్రస్‌‌‌‌‌‌‌‌లు, బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. షెల్‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్న ఆ నలుగురి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసింది. గోరంట్ల అసోసియేట్స్‌‌‌‌‌‌‌‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్‌‌‌‌‌‌‌‌.. గ్రామీణ ప్రాంతాల్లోని అకౌంట్స్‌‌‌‌‌‌‌‌కు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. వాటి ఆధారంగా చేతులు మారిన డబ్బుల లెక్కలు తీస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని 4 అకౌంట్స్‌‌‌‌‌‌‌‌లో పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్‌‌‌‌‌‌‌‌ అయినట్లు, మళ్లీ అక్కడి నుంచి వివిధ అకౌంట్లకి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్లు ఆధారాలు సేకరించింది.