పేరుకే మహానగరాలు.. కాని మహిళలకు రెంట్​ హౌస్​ దొరకదు..

పేరుకే మహానగరాలు.. కాని మహిళలకు రెంట్​ హౌస్​ దొరకదు..

భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు  వంటి మహానగరాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి.  పాలకులు కూడా అలా అభివృద్ది చేసేందుకే  ప్రణాళికలు రూపొందిస్తుంటారు. కాని అలాంటి నగరాల్లో బ్యాచిలర్​ వుమెన్స్​జాబ్​ చేయాలంటే పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు..  బ్యాచిలర్​ మహిళలకు ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ఓనర్లు అడిగే ప్రశ్నలు.. వారు పెట్టే కండీషన్స్​ వింటే.. మహానగరాలకు ఎందుకొచ్చామా అని మహిళలు బిత్తరపోతున్నారు.  దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా బ్యాచిలర్​ ఎంప్లాయ్​ రెంటెడ్​ హౌజ్​ కోసం పడిన కష్టాలను.. ఎదుర్కొన్న అవమానాలను సోషల్​ మీడియాలో పోస్టు చేసింది. .. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మహానగరాలు వేగంగా అభివృద్ధి. చెందుతున్నాయని గొప్పగా చెప్పుకుంటాం. సిటీల్లో అమ్మాయిలు కాస్త స్వేచ్చగా బతుకుతారనుకుంటాం...  కానీ, అమ్మాయిలకు అంత ఫ్రీడమ్ ఇచ్చేంత స్థాయికి నగరాలు ఇంకా ఎదగలేదని ఈ వార్త చదివితే అర్దమవుతుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి.  దీనికి దేశరాజధాని  ఢిల్లీ వంటి మహా నగరమే ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ చదువుకునే అమ్మాయిలకు, ఉద్యోగం చేసే బ్యాచిలర్​ మహిళలకు  ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు. ఒంటరిగా ఉండే అమ్మాయిలకు ఇల్లు అద్దెకిచ్చేందుకు చాలా మంది ఇష్టపడడంలేదు. ఒకవేళ అద్దెకివ్వాలన్నా లెక్కలేనన్ని కండిషన్స్ పెడుతున్నారు. 

ఢిల్లీలో అద్దె ఇంటికోసం వెళ్తే ఒక అమ్మాయి తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పేర్ చేసుకుంది. ఇక్కడ సాఫ్ట్​ వేర్, మెడిసిన్​ సహా వివిధ రంగాల్లో మహిళా ఉద్యోగుల శాతం ఎక్కువగానే ఉంటుంది. వీళ్లలో చాలామంది పెద్ద ఉద్యోగాలు చేస్తూ, మంచి జీతాలు అందుకుంటున్నారు. లైఫ్​ కూడా లగ్జరీ గానే ఉంటోంది. ఎక్కడెక్కడి నుండో మహా నగరాలకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారు.   ఇలా ఉద్యోగం చేసే వారు హాస్టల్లో ఉండటమో.. ఇల్లు అద్దెకు తీసుకొని ఉండటమే చేయాలి.  హాస్టల్ లో ఉంటే ఫుడ్​ బాగుండదు...  రెంటెడ్ హౌజ్ కావాలి.  ఒకేచోట ఎక్కువ మంది ఉండటం వల్ల ప్రైవసీ లేకపోవడం వంటి ఇబ్బందులుంటాయి. ఇది కాదనుకుంటే ఏదైనా ఇల్లు, ఫ్లాట్ రెంట్ కు తీసుకోవాలి అసలు సమస్య ఇక్కడే వస్తోంది. ఎందుకంటే సింగిల్ ఉమెన్ కి రెంట్ కి ఇచ్చేందుకు ఇంటి ఓవర్లు కండీషన్లు పెడుతున్నారు.

కండీషన్స్ అప్లై

మహానగరాల్లో ఉద్యోగం చేసుకుంటూ.. రెంటెండ్​ హౌజ్​ సెర్చ్​ చేయాలంటే కష్టమైన పని.. ఏరియా ఎలాంటిదో కూడా తెలిసి ఉండాలి.  దీనికోసం ఇంటి బ్రోకర్లను పట్టుకుని, మంచి ఇల్లు వెతుక్కుంటారు.  ఇల్లు నచ్చింది కదా అని మంత్లీ రెంటు, కండీషన్స్ వంటివి ఓనర్లతో డిస్కస్​ చేయడం దగ్గరే సమస్య వస్తుంది.    సాధారణంగా ఫ్యామిలీకైతే ఈజీగానే ఇల్లు అద్దెకిస్తారు. బ్యాచిలర్స్ కు అయితే రెంటుకివ్వడం చాలా కష్టం. అబ్బాయిలకైతే ఏదోలా ఇచ్చేస్తారు. కానీ, అమ్మాయిల విషయంలోనే ఎక్కడలేని నిబంధనలు పెడతారు. పెళ్లికాని, ఒంటిరి అమ్మాయిలకు ఇల్లు ఇచ్చేందుకు ఢిల్లీ వంటి మహా నగరాల్లో అప్పులు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే మాత్రం చాలా కండీషన్స్ పెడుతున్నారు.

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

రెంటుకిచ్చేముందు ఓనరు అమ్మాయిల్ని చాలా విషయాల్లో ప్రశ్నిస్తున్నారు. కుటుంబ నేపథ్యం.. నేటివ్ ప్లేస్ వివరాలు మొదలుకొని ఉద్యోగ వివరాలు, ఆఫీస్ టైమింగ్స్, డ్రింకింగ్, స్మోకింగ్, పార్టీ, ఫుడ్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్నేహితుల వివరాలన్నీ అడుగుతున్నారు. అన్నింటికీ మించి బాయ్ ఫ్రెండ్/ పార్ట్నర్ గురించి కూడా కనుక్కుంటున్నారు. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇంటికి. తీసుకురావొద్దని స్ట్రిక్ట్​గా చెప్తున్నారు. వీటితోపాటు చెప్పిన టైమ్​ లోపే ఇంటికి రావాలని, అలస్యమైతే గేట్ క్లోజ్. చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఆ మాత్రం తెలియదా?

ఓనర్లు వ్యక్తిగత ప్రశ్నలు అడగడం, అనవసర రూల్స్ పెట్టడంపై అమ్మాయిలు అభ్యంతరంవ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం స్వేచ్ఛలేకుండా. ఇన్ని కట్టుబాట్ల మధ్య ఎలా ఉండటం అని ప్రశ్నిస్తున్నారు. రెంటెడ్ హౌజ్ లో ఎలా ఉండాలో తమకు తెలుసు అని అంటున్నారు. రెంట్​కి ఇంటిని ఇచ్చిన తరువాత  ఓనర్లు ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయకూడదు. రెంటెడ్ హౌజ్లో ఎలా ఉండాలో మాకు తెలుసు. ఇంటిని, ఫర్నీచర్​ ను పాడు చేయకూడదు. పరిశుభ్రత పాటించాలి. చుట్టు పక్కల వాళ్లకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలి. సౌండ్ పెట్టి ఇరిటేట్ చేయకూడదు. నీళ్లు జాగ్రత్తగా వాడుకోవాలి. చెడ్డ పనులు చేయకూడను..

ఓవర్లు- .. టెనెంట్స్ గౌరవంతో ఉండాలి. మేం రెంటీ ఇస్తున్నాం. వాళ్లు ప్లేస్ ఇస్తున్నారు. అంతే... దానికే పర్సనల్ విషయాల్లో కలుగుజేసుకోకూడదు' అని. ఒక అమ్మాయి రెంటెడ్​ హౌజ్​ కోసం సెర్చ్​ చేసే సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్​మీడియాలో పోస్ట్​ చేసింది. 'ఇటీవల మా కొలీగ్​  ఒకరు ...ఇంటి కోసం ఓనర్ ను కలిస్తే వాళ్లు తాము చెప్పిన టైమ్లో లోపే ఇంటికి రావాలని చెప్పారట. ఆ అమ్మాయి ఐటీ కంపెనీలో ఒక టీమ్ లీడ్ చేస్తోంది. వర్క్ ప్రెజర్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. టైమింగ్ అంటూ ఉండదు. ఒక్కోసారి అర్థరాత్రి అవ్వొచ్చు. రాత్రి ఫలానా టైమ్ కే ఇంటికొచ్పేయాలంటే ఆమె కెరీర్ పై ఎలా దృష్టి పెట్టగలదు. ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల ఉపయోగంలేదు. పేరుకే మహా నగరాలు.. కానీ అమ్మాయిల లైఫ్ స్టైల్ ను అర్థం చేసుకోవడం లేదు" అని పోస్టు పెట్టింది. 

ఇలా అనేక ప్రాంతాల వారు అక్కడికి వచ్చి అక్కడ జాబ్​ చేయబట్టే కదా అవి మహానగరాలుగా మారాయి.. అన్న విషయం కూడా ఆలోచించరు.    ఓ మహిళగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి అండగా ఉండాల్సింది పోయి.. అడ్డగోలు కండీషన్స్​.. సంబంధం లేని ప్రశ్నలు వేయడం.. ఎంత వరకు సమంజసమో మహానగరాల్లో ఉండే హౌజ్​ ఓనర్స్​ ఆలోచించాలి. అంతేకాదు ఇలా అనేక ప్రాంతాల వారు అక్కడికి వచ్చి అక్కడ జాబ్​ చేయబట్టే కదా అవి మహానగరాలుగా మారాయి.. వారి ఆస్థికి అంత విలువ వచ్చింది.. సో బిగ్​ సిటీస్​ హౌస్​ ఓనర్స్​... ఉమెన్​ బ్యాచిలర్​ ఎంప్లాయిస్​పై చిన్నచూపు చూడకండి.. వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించకండి.. . .