Delhi Rains:ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం..రెడ్ అలెర్ట్ జారీ

Delhi Rains:ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం..రెడ్ అలెర్ట్ జారీ

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం(ఆగస్టు9) ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో ఢిల్లీ ఎన్ సీఆర్ లోని ఆర్కేపురం, శాస్త్రిభవన్, మోతీబాగ్, కిద్వాయ్ నగర్, భరత్ మండపం గేంట్ 7, మధుర రోడ్ తో సహా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.  రానున్న గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ (ఐఎండీ). 

పలు విమానాలు రద్దు

భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫ్లైట్‌రాడార్ డేటా ప్రకారం శనివారం ఉదయం 105 విమానాలు ఆలస్యంగా నడిచాయి. తాజా విమాన సమాచారం కోసం, ప్రయాణీకులు వారి సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు" అని ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. 

రానున్న నాలుగు రోజులు వర్షాలే.. 

ఆగస్టు 14 వరకు ఢిల్లీ ,దాని పొరుగు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఆగస్టు 14 వరకు ఉష్ణోగ్రతలు కనిష్ట, గరిష్ట  23 డిగ్రీల సెల్సియస్ ,34 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని IMD అంచనా వేసింది.  

►ALSO READ | జమ్మూకాశ్మీర్ లో ఎదురు కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

నైరుతి ఉత్తరప్రదేశ్ పై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని దీని వలన రాబోయే మూడు రోజులు రుతుపవన ద్రోణి ఢిల్లీకి దగ్గరగా మారే అవకాశం ఉందని స్కైమెట్ వాతావరణ సేవలు తెలిపాయి. దీని వలన విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.