ఢిల్లీలో ఒక్క రోజే 50 శాతం పెరిగిన కరోనా కేసులు 

ఢిల్లీలో ఒక్క రోజే 50 శాతం పెరిగిన కరోనా కేసులు 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వైరస్ కేసులు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో 50 శాతం మేర అధికంగా కేసులు పెరగడం గమనార్హం. ముందురోజు అక్కడ 202 మందికి కరోనా సోకగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 299కి చేరింది. కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం నుంచి 2.70 శాతానికి పెరిగింది. మరోపక్క దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్యలో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. 

దేశంలో బుధవారం 4.34 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 1,007 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజు కంటే ఏడు శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. నిన్న దేశవ్యాప్తంగా ఒకే ఒక్క మరణం నమోదైంది. ఆ ఒక్కటి కూడా మహారాష్ట్రలో రికార్డయింది. 818 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. 

మరిన్ని వార్తల కోసం:

రివ్యూ: కేజీఎఫ్ 2

బీజేపీకి అంబేద్కర్ ఆదర్శం