
ఢిల్లీలో 11 ఏళ్ల బాలుడిని హత్య చేసిన కేసులో పోలీసులు ఓ మహిళను అరెస్ట్ చేశారు. 24 ఏళ్ల పూజ కుమారి.. ఆ చిన్నారి తండ్రి జితేంద్రతో గత కొన్నాళ్లుగా సంబంధం ఉంది. అయితే తమ సంబంధానికి ఆ చిన్నారి అడ్డొస్తుందని భావించిన మహిళ.. ఈ ఘాతుకానికి పాల్పడింది.
పూజ కుమారికి చిన్నారు తండ్రి జితేంద్రతో సంబంధం ఉంది. ఇద్దరూ 2019లో కలిసి జీవించడం ప్రారంభించారు. కానీ మూడేళ్ల తర్వాత ఆ వ్యక్తి తన భార్య, కొడుకు వద్దకు తిరిగి వెళ్లిపోయాడు. దీంతో పూజ ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో ఆగస్టు 10న ఇందర్‌పురిలోని జితేంద్ర ఇంటి అడ్రస్ చెప్పమని ఆమె ఒక కామన్ ఫ్రెండ్‌ని కోరింది. ఎట్టకేలకు ఆమె అతని ఇంటికి చేరుకుంది. కానీ ఆమె వెళ్లే సరికి అతను ఆ ఇంట్లో లేడు. అతని కొడుకు మాత్రం బెడ్‌పై నిద్రించి ఉండడం గమనించిన ఆ మహిళ.. బాలుని గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత బెడ్ బాక్స్ లో ఉన్న బట్టలను తీసేసి, అందులో అతని మృతదేహాన్ని పెట్టింది.
ఘటన అనంతరం సీసీ కెమెరాల ఫుటేజీ సహాయంతో పోలీసులు మహిళను గుర్తించగలిగారు. ఆ తర్వాత ఆమెను మూడు రోజుల పాటు వెతకగా ఫైనల్ గా ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.