DEll Layoffs: డెల్లో భారీగా ఉద్యోగాల కోత

DEll Layoffs: డెల్లో భారీగా ఉద్యోగాల కోత

టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో లేఆఫ్ పరంపర కొనసాగుతోంది. అమెజాన్, ట్విట్టర్, గూగుల్, మైక్రోసాఫ్ట్ బాటలోనే చాలా కంపెనీలు నడుస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి దిగ్గజ టెక్ సంస్థ డెల్ చేరింది. మొత్తం 6,650 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్ ప్రక్రియ ఆ కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 5 శాతం ఉంటుంది. ఇటీవల పర్సనల్ కంప్యూటర్స్ కు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో డెల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బ్లూమ్ బర్గ్ నివేదికలో తెలిపింది. 

డెల్ కంపెనీ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోబాన్ని ఎదుర్కొంటోందని, వాటినినుంచి బయటపడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ కో-సీఓఓ జెఫ్ క్లార్క్ వెల్లడించారు. పోయిన ఏడాది రెండవ త్రైమాసికానికి డెల్ కంప్యూటర్ విక్రయాలు 2021తో పోలిస్తే 37శాతం తగ్గాయి. ఈ నష్టాలనుంచి గట్టెక్కడానికి డెల్ లేఆఫ్ లు ప్రకటించింది.