
- ఫైనాన్షియల్, మాన్యుఫాక్చరింగ్, ఈ–కామర్స్, అగ్రికల్చర్ సెక్టార్లకు బూస్ట్
- ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారీ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్లతో లింక్
- డెలాయిట్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ఎకానమీని పరుగులు పెట్టిస్తుందని డెలాయిట్ అంచనా వేస్తోంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, అగ్రికల్చర్, మాన్యుఫాక్చరింగ్, రిటైల్ ఈ–కామర్స్ సెక్టార్లు మరింత వృద్ధి చెందడంలో సాయపడుతుందని పేర్కొంది. చిన్న వ్యాపారులు కూడా ఆన్‌లైన్‌లో తమ ప్రొడక్ట్‌లను అమ్ముకోవడానికి ఓఎన్‌డీసీ వెబ్‌సైట్ సాయపడుతుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో జాయిన్ అయ్యి వ్యాపారులు తమ ప్రొడక్ట్‌లను అమ్ముకోవచ్చు. ఓఎన్‌డీసీ ఒక విధంగా అమెజాన్ వెబ్‌సైట్‌లా పనిచేస్తుంది. కానీ, ఇందులో గూడ్స్‌తో పాటు సర్వీస్‌లు అమ్ముకోవచ్చు.
ఫైనాన్షియల్ సంస్థలు ఓఎన్‌డీసీ ద్వారా చిన్న వ్యాపారాలు (ఎంఎస్‌ఎంఈలు) లతో కనెక్ట్ అవ్వడానికి వీలుంటోందని డెలాయిట్ రిపోర్ట్ పేర్కొంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండడంతో అప్పుల కోసం ప్రభుత్వ స్కీమ్‌లు, నాన్ బ్యాంకింగ్ కంపెనీలపై ఎంఎస్‌ఎంఈలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. పెద్ద ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లు వీటికి అప్పులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ‘కానీ, ఎన్‌డీసీసీ ప్లాట్‌ఫామ్‌తో ఎంఎస్‌ఎంఈలు ఎంత వరకు అర్హులనే విషయాన్ని పెద్ద ఫైనాన్షియల్ సంస్థలు అంచనావేయడానికి వీలుంటుంది. ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌లో ఎంఎస్‌ఎంఈల ట్రాన్సాక్షన్ల డేటా ఆధారంగా ఈ కంపెనీల క్రెడిట్ వర్తీనెస్ (అప్పులు తీసుకోవడానికి ఎంత వరకు అర్హులు) అనే విషయాన్ని అంచనావేయగలుగుతాయి’
అని డెలాయిట్ రిపోర్ట్ పేర్కొంది. ‘ఓఎన్‌డీసీ చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా విస్తరించే కొద్దీ బ్యాంకుల కోసం కొత్త అవకాశాలు క్రియేట్ అవుతాయి. చిన్న వ్యాపారులకు అవసరమయ్యే ప్రొడక్ట్‌లు, సర్వీస్‌లను తీసుకొస్తాయి’ అని వివరించింది. చిన్న వ్యాపారులు ఎక్కువగా రీజినల్ ఫైనాన్షియల్ సంస్థల నుంచే అప్పులు తీసుకుంటున్నాయని, ఓఎన్‌డీసీ వలన డిజిటల్‌గా విస్తరించే పెద్ద ఫైనాన్షియల్ సంస్థలు వీరికి చేరువవుతాయని అభిప్రాయపడింది. ఆర్‌బీఐ విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం, దేశంలోని ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు రూ. 20–25 లక్షల కోట్ల అప్పులు అవసరం ఉంది.
ఆన్‌లైన్ అమ్మకాలు..
రిటైల్ సెక్టార్‌లో ఆన్‌లైన్ షాపింగ్ వాటా రోజురోజుకి పెరుగుతోంది. బ్రాండ్లు, రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లయర్లు ఓఎన్‌డీసీ నెట్‌వర్క్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి, కస్టమర్లను చేరుకోవడానికి వీలుంటుందని డెలాయిట్ రిపోర్ట్ పేర్కొంది. ఇప్పటికే గ్రోసరీ, ఫుడ్ డెలివరీ, హోమ్ అండ్ డెకర్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, బ్యూటీ, పర్సనల్ కేర్, ఫార్మాస్యూటికల్స్ సెగ్మెంట్‌లు ఓఎన్‌డీసీని సక్సెస్‌ఫుల్‌గా వాడుకుంటున్నాయి.
‘ఓఎన్‌డీసీ ద్వారా బ్రాండ్‌లు లేదా ఎంఎస్ఎంఈలు తక్కువ ఖర్చుకే తమ డిమాండ్‌ను చేరుకుంటున్నాయి. సప్లయర్లతో కనెక్ట్ అవుతున్నాయి. బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ), బిజినెస్ టు కన్జూమర్ (బీ2సీ) వ్యాపారాలకు బోలెడు అవకాశాలు ఉన్నాయి’ అని డెలాయిట్ రిపోర్ట్ పేర్కొంది. ఈ నెట్‌వర్క్‌లో జాయిన్ అయ్యాక వ్యాపారులు తమ ఫిజికల్ అవుట్ లెట్లను, డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు లేదా వేర్‌హౌస్‌లను తమ ఆన్‌లైన్ సేల్స్‌తో కనెక్ట్ చేయగలుగుతున్నాయని వెల్లడించింది. ఈ నెట్‌వర్క్‌తో డిస్ట్రిబ్యూటర్లు తమ నెట్‌వర్క్‌ను మరింత పెంచుకోవచ్చని వెల్లడించింది. వ్యాపారులు ఓఎన్‌డీసీ ద్వారా 24x7 గంటలు ఆర్డర్ పెట్టడం, తర్వాతి రోజు డెలివరీ, ఆటో ఆర్డరింగ్, క్రెడిట్ మేనేజ్‌మెంట్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తేవచ్చని పేర్కొంది.
మాన్యుఫాక్చరింగ్ సెక్టార్..
కరోనా, గ్లోబల్‌గా పొలిటికల్ టెన్షన్ల వలన మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సప్లయ్ చెయిన్‌లో అనేక ఇబ్బందులు నెలకొన్నాయి. కాంపోనెంట్ల షార్టేజ్ ఏర్పడింది. కమొడిటీల ధరలు విపరీతంగా పెరిగాయి. ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌తో ఈ సమస్యల్లో కొన్నింటినైనా పరిష్కరించడానికి వీలుంటుందని డెలాయిట్ రిపోర్ట్ అంచనావేస్తోంది. ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లో ఉన్న లాజిస్టిక్స్ సర్వీసెస్ కంపెనీలు సప్లయ్ చెయిన్ సమస్యలను తగ్గించగలవని నమ్ముతోంది. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గొచ్చని, మొత్తంగా డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లో సప్లయర్లు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు (ఓఈఎం) తమ సప్లయ్‌లో అంతరాయం ఏర్పడకుండా చూసుకుంటాయని వెల్లడించింది. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే మరో సప్లయర్‌తో కనెక్ట్ అవ్వడానికి ఓఎన్‌డీసీ సాయపడుతుందని పేర్కొంది.
అగ్రికల్చర్ సెక్టార్..
అగ్రికల్చర్ సెక్టార్‌లోని బయ్యర్లు, సెల్లర్లు ఓఎన్‌డీసీ నెట్‌వర్క్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి వీలుంటుందని డెలాయిట్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ నెట్‌వర్క్‌తో అగ్రీ సెక్టార్‌లో టెక్నాలజీ వాడకం మరింత పెరుగుతుందని తెలిపింది. ‘అగ్రీటెక్ స్టార్టప్‌లకు ఓఎన్‌డీసీ ఓ వరం. తమ కస్టమర్లను చేరుకోవడానికి ఈ నెట్‌వర్క్ సాయపడుతుంది. టెక్నాలజీ, ఎక్విప్‌మెంట్, సర్వీస్‌లను కంపెనీల నుంచి, ప్రభుత్వం నుంచి పొందడంలో సాయపడుతుంది’ అని డెలాయిట్ రిపోర్ట్ వెల్లడించింది. వివిధ ఇండస్ట్రీలు వృద్ధి చెందడానికి బోలెడు అవకాశాలను ఓఎన్‌డీసీ క్రియేట్ చేస్తోందని డెలాయిట్ సౌత్ ఏషియా ప్రెసిడెంట్ సతీష్ గోపాలయ్య అన్నారు.