ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేస్టేనా.. దారుణంగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు..

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేస్టేనా.. దారుణంగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు..

ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, డెంగ్యూ పరిస్థితి దేశవ్యాప్తంగా దారుణంగా ఉంది. బీహార్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో డెంగ్యూ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రైవేట్ ఆసుపత్రుల డేటాను గమనించినట్లయితే, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో, డెంగ్యూ కేసుల సంఖ్య 13వేలు దాటింది. లక్నో, మొరాదాబాద్, మీరట్, కాన్పూర్స, నోయిడాలు ప్రాథమిక హాట్‌స్పాట్‌లుగా మారాయి.

అక్టోబర్ 19న గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగ్యూతో బాధపడుతున్న ఒక మహిళ మరణించింది, వైద్యుల నిర్లక్ష్యంగానే ఆమె చనిపోయిందని ఆరోపిస్తూ ఆ మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు నిరసన చేపట్టారు. ధనోరి గ్రామానికి చెందిన మహిళను అక్టోబర్ 18న బీటా 2 పోలీస్ స్టేషన్ పరిధిలోని యథార్త్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె ఈ రోజు ఆసుపత్రిలో మరణించింది.

Also Resd :- మెడ నొప్పే కదా అని కొట్టిపారేస్తున్నారా.. ఇది క్యాన్సర్ కు కారకమట

దీంతో ఆస్పత్రి నిర్లక్ష్యమే ఆమె మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం ఆస్పత్రి యాజమాన్యంతో పలు చర్చల తరువాత సమస్య పరిష్కారమైంది. కుటుంబ సభ్యులు ఆ మహిళ డెడ్ బాడీని పోస్ట్‌మార్టం చేసేందుకు నిరాకరించారు, అనంతరం మహిళ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ఘటనలో శాంతిభద్రతలకు సంబంధించిన సమస్య లేదని పోలీసులు తెలిపారు.