ప్రమోషన్‌ ఇవ్వలేదని.. పైఅధికారిని చంపడానికి సుపారీ ఇచ్చిన ఇంజనీర్లు

ప్రమోషన్‌ ఇవ్వలేదని.. పైఅధికారిని చంపడానికి సుపారీ ఇచ్చిన ఇంజనీర్లు

ప్రమోషన్ ఇవ్వలేదని ఇద్దరు జూనియర్ ఇంజనీర్లు తమ పైఅధికారిని చంపడానికి ప్లాన్ వేశారు. ఏకం రూ.20 లక్షల సుపారీ ఆఫర్‌‌ చేసి  కిరాయి గూండాలను రంగంలోకి దింపారు. అయితే గూండాలు జరిపిన కాల్పుల్లో ఆ అధికారి తప్పించుకున్నాడు. దీనిపై పోలీసులు ఎంక్వైరీ చేయగా.. ఆ ఇద్దరు ఇంజనీర్లతో పాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ముంబై సిటీలో జరిగింది.

21 ఏండ్లుగా ప్రమోషన్ రాలేదని..

మహారాష్ట్రలోని మీరా భయందర్‌‌ సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌లో యశ్వంత్ దేశ్‌ముఖ్, శ్రీకృష్ణ మోహితే అనే ఇద్దరు జూనియర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. మున్సిపాలిటీ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో 2000 సంవత్సరంలో చేరినప్పటికీ నేటి వరకూ ఒక్కసారి కూడా ప్రమోషన్ రాలేదు. అయితే ఈ ప్రమోషన్ల కమిటీలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దీపక్ ఖాంబిత్‌ను వాళ్లు పలుమార్లు కలిశారు. మీ ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే ప్రమోషన్ రాలేదని ఆయన చెప్పి పంపించేస్తుండడంతో వాళ్లు ఆగ్రహంతో రగిలిపోయారు. ఎలాగైనా ఆయనను చంపేయాలని ప్లాన్ చేశారు. దీంతో ఆఫీసులో తమకు పరిచయమైన రాజు విశ్వకర్మ అనే వ్యక్తిని కలిశారు. గతంలో జైలుకు వెళ్లొచ్చిన రాజు ఆ తర్వాత ఫైట్ ఫర్ రైట్స్ అనే సంస్థను పెట్టి సెటిల్మెంట్స్ చేస్తుంటాడు. అయితే ఇది మర్డర్ విషయం కావడంతో రాజుకు జైలులో పరిచయమైన గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్  దగ్గర పని చేసిన అమిత్ సిన్హా అనే వ్యక్తిని యశ్వంత్, శ్రీకృష్ణలకు పరిచయం చేశాడు. రూ.20 లక్షలు సుపారీ ఇస్తామని, తమ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ దీపక్‌‌ను చంపేయాలని ఆ ఇద్దరు కోరారు. దీంతో ఒకే చెప్పి అమిత్ సిన్హా, అజయ్ సింగ్ అనే షూటర్‌‌ను రంగంలోకి దించాడు. 

ముందుగా రూ.10 లక్షలు అడ్వాన్స్ తీసుకుని, ఆరు నెలల క్రితమే మర్డర్‌‌కు ప్లాన్ చేశారు. పలుమార్లు రెక్కీ చేసి సెప్టెంబర్ 29న ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీపక్ ఆఫీస్‌ నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా అమిత్, అజయ్ ఇద్దరూ బైక్‌పై ఫాలో చేశారు. అదను చూసి వెనుక సీటులో కూర్చుని ఉన్న దీపక్‌పై కాల్పులు జరిపారు. అయితే అదృష్టవశాత్తు తూటాలు గురి తప్పి చిన్న గాయాలతో దీపక్‌ బయటపడ్డాడు. ప్రాణాలతో బయటపడిన ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో సీసీకెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మొదట అజయ్, అమిత్‌లను అరెస్టు చేశారు. వారిని ఇంటరాగేట్ చేయగా.. తమకు యశ్వంత్, శ్రీ కృష్ణ సుపారీ ఇచ్చిన విషయం చెప్పేశారు. దీంతో బుధవారం ఆ ఇద్దరిని ముంబైలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

ఎంత మందిని అరెస్టు చేశారో చెప్పాలె: సుప్రీం

మాజీ మంత్రి ఈటలకు కీలక పదవి 

హెడ్మాస్టర్ ఇంట్లో ఫంక్షన్.. ఫుడ్ పాయిజనింగ్‌తో 100 మంది ఆస్పత్రిపాలు

హత్యలతో నిరసనలను అణచివేయలేరు: బీజేపీ ఎంపీ వార్నింగ్