విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

 విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

కోడేరు, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో ఏ.రమేశ్  హెచ్చరించారు. శుక్రవారం కేజీబీవీ, సీపీఎస్, జీపీఎస్, పసుపుల యూపీఎస్ ను సందర్శించారు. పసుపుల యూపీఎస్ లో భోజనాన్ని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. ఎస్సెస్సీలో ఉత్తమ మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఎంఈవో భాస్కరశర్మ, కేజీబీవీ స్పెషల్  ఆఫీసర్  కవిత, జీసీడీవో శోభారాణి, సీఆర్పీ విజయలక్ష్మి పాల్గొన్నారు.