ఫైనల్ ఎగ్జామ్ కు టెన్త్ విద్యార్థుల ప్రిపరేషన్

ఫైనల్ ఎగ్జామ్ కు టెన్త్ విద్యార్థుల ప్రిపరేషన్
  • బోర్డు ఎగ్జామ్స్​ కోసం టెన్త్​ స్టూడెంట్లను ప్రిపేర్ ​చేసేందుకు పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: కరోనా కారణంగా స్టూడెంట్లలో చదువుపై కాన్సంట్రేషన్​ తగ్గిపోయింది. రెండేండ్లకు పైగా ఫిజికల్ క్లాసులు, పరీక్షలకు దూరంగా ఉండిపోయారు. దీంతో స్టూడెంట్లలో మానసిక సమస్యలు రావడం,  లెర్నింగ్​పై ఆసక్తి తగ్గిపోయాయి.  ప్రస్తుతం స్కూళ్లు నార్మల్​గా​ కొనసాగుతుండగా,  పదో తరగతి పిల్లలకు బోర్డు పరీక్ష సమయం సమీపిస్తుండగా వారిపై ఒత్తిడి తగ్గించేలా విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. 

ముందుగా ప్రాక్టికల్స్ 
స్టూడెంట్లలో బోర్డ్​ఎగ్జామ్స్​పై భయాన్ని పోగొట్టేందుకు ముందుగా స్కూళ్లలో ప్రాక్టీస్​ ఎగ్జామ్స్​పెట్టి అవగాహన కల్పించాలని విద్యాశాఖ  ఆదేశించింది. దీంతో మార్చి​లో రెండు సార్లు ముందస్తు ప్రాక్టీస్ టెస్టులను నిర్వహించారు. ఈ క్రమంలో మే చివరి వారంలో బోర్డ్​ఎగ్జామ్స్​షెడ్యూల్​ రిలీజైంది.  ఎండల తీవ్రత స్టూడెంట్లపై ప్రభావాన్ని చూపుతుందని  పేరెంట్స్, టీచర్లు ఆ సమయంలో పరీక్షలు వద్దని అంటున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీల్లో మార్పాలుంటాయా లేదా వేచి చూడాలి.  ఏప్రిల్​లో మరో ప్రాక్టీస్​ టెస్ట్ ​పెట్టాల్సి ఉందని, ఆ తర్వాత ప్రీ ఫైనల్​ఎగ్జామ్స్ ​ఉంటాయని టీచర్లు అంటున్నారు.  

ఏ సబ్జెక్ట్​లో వెనకబడి ఉన్నారనేది..
ప్రాక్టీస్ ​ఎగ్జామ్స్ రాస్తే  ఫైనల్ ఎగ్జామ్​లో  క్వశ్చన్ పేపర్ గురించి స్టూడెంట్లకు అవగాహన వస్తుంది.  ఇంపార్టెంట్ ప్రశ్నల మీద పట్టు కుదురుతుంది. దీంతో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎగ్జామ్ ఎలా పూర్తి చేయాలనేది స్టూడెంట్లకు తెలుస్తుందని టీచర్లు చెప్తున్నారు. ప్రాక్టీస్ టెస్టుల ద్వారా స్టూడెంట్లు ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారనేది  తెలుస్తుంది. దీంతో వెనకబడిన స్టూడెంట్లపై ప్రత్యేక ఫోకస్​ పెట్టొచ్చని టీచర్లు చెప్తున్నారు. 

స్టూడెంట్స్​లో ఇంట్రెస్ట్​ పెంచేందుకు..
స్టూడెంట్లకు ముందుగా రివిజన్ చాలా అవసరం. కరోనా కారణంగా రెండేండ్ల నుంచి చదువు సక్కగ సాగలేదు. ప్రాక్టీస్ ఎగ్జామ్​తో వారిలో కొంత ఇంట్రెస్ట్​ పెరుగుతుంది. ఎగ్జామ్​ రాసే విధానం,  ఇన్​టైమ్​లో ఎలా పూర్తి చేయాలనే అంశాలు తెలుస్తాయి. 
-  శారద, హెచ్ఎం, గవర్నమెంట్ హైస్కూల్, మాసబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్

ఎగ్జామ్స్​పై కాన్సంట్రేషన్​ చేసేందుకు..
కొన్ని రోజుల కిందటి వరకు టెన్త్ స్టూడెంట్లు బోర్డ్ ఎగ్జామ్స్ రాసేందుకు సిద్ధంగా లేకుండే.  వారు ఎగ్జామ్స్​పై కాన్సంట్రేషన్​ చేసేందుకు ఈ టెస్ట్ లను నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు కూర్చొని ఎగ్జామ్ రాయడం కూడా ఇప్పుడే ప్రాక్టీస్ అవుతోంది. 
- పద్మ, టీచర్, ఉప్పల్ గవర్నమెంట్ స్కూల్